- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నా ప్రేమను రిజెక్ట్ చేశాడు : పాయల్
దిశ, సినిమా: సోషల్ మీడియా పుణ్యమా అని అభిమానులకు, సెలబ్రిటీలకు మధ్య ఉన్న దూరం చాలా వరకు తగ్గిపోయింది. దీంతో అభిమానులు వారి అభిమాన తారలకు సంబంధించిన విషయాలను సులభంగా తెలుసుకోగలుగుతున్నారు. ఈ క్రమంలోనే హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ తన కొత్త చిత్రం ‘మంగళవారం’తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుండగా.. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా పాయల్ ఒక ఇంటర్వ్యూలో సినిమా సంబంధించిన విశేషాలు, తన వ్యక్తిగత విషయాలు పంచుకుంది.
ఇందులో భాగంగా ముందుగా యాంకర్ ‘చదువుకునే రోజుల్లోనైనా, చిత్ర పరిశ్రమలోనైనా మీ క్రష్ ఎవరు?’ అని ప్రశ్నించగా ఆమె స్పందిస్తూ.. ‘స్కూల్ డేస్‌లో ఒక అబ్బాయిని ప్రేమించాను. అతడిని చూడగానే ఏదో తెలియని ఆనందం, మనసుకు హాయిగా ఉండేది. ఒక సారి మంచి టైం చూసుకుని నా ప్రేమను వ్యక్తం చేశాను. కానీ అతడు నన్ను రిజెక్ట్ చేశాడు. తట్టుకోలేకపోయాను. ఆ బాధతో చదువుపై దృష్టి తగ్గిపోయింది. పరీక్షల్లో ఫెయిల్ అయ్యాను. నా ప్రవర్తన చూసి అమ్మ చాలా బాధ పడింది. విషయం చెప్పి ఏడ్చేశాను’ అంటూ తన మొదటి ప్రేమను గుర్తుచేసుకుంది పాయల్. అలాగే ' నా కెరీర్ లో ఎప్పటికీ గుర్తుండిపోయే మూవీ ‘మంగళవారం’ అవుతుంది. ఈ కథ అందరికీ కచ్చితంగా నచ్చుతుంది. దీనిపైనే నా ఆశలన్నీ పెట్టుకున్నా' అంటూ చెప్పుకొచ్చింది.
- Tags
- Payal Rajput