Venu Swamy: అతను వేధిస్తున్నాడు దయచేసి మా జీవితాలను కాపాడండి.. వేణు స్వామి దంపతుల సంచలన వీడియో

by Hamsa |
Venu Swamy: అతను వేధిస్తున్నాడు దయచేసి మా జీవితాలను కాపాడండి.. వేణు స్వామి దంపతుల సంచలన వీడియో
X

దిశ, సినిమా: ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి, ఆయన భార్య సింగర్ వీణా శ్రీవాణి అందరికీ సుపరిచితమే. వీరిద్దరు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ పలు పోస్టులు పెడుతుంటారు. అయితే ఇటీవల నాగచైతన్య, శోభితలపై కామెంట్స్ చేయడంతో వివాదాస్పదమైంది. దీంతో వేణు స్వామి ఇక సెలబ్రిటీల జాతకాలు చెప్పను అని ప్రకటించాడు. ఇదిలా ఉంటే.. తాజాగా, వేణు స్వామి ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ సంచలన వీడియో విడుదల చేసి అందరిని ఆశ్చర్యానికి గురి చేశాడు. అలాగే అదే వీడియోను ఆయన భార్య వీణా శ్రీవాణి కూడా షేర్ చేసి మా జీవితాలను కాపాడండి అని వేడుకుంది. ‘‘ నన్ను ప్రముఖ జర్నలిస్ట్ బెదిరిస్తున్నాడు. 2017లో మహా టీవీలో ఉన్నప్పుడు నా మీద దాడి చేయడం ప్రారంభించారు. నన్ను నాశనం చేయడానికి కూడా తీవ్రమైన ప్రయత్నాలు జరిగాయి. అప్పుడు నేను వాళ్ళు అడిగిన డబ్బులు నేను ఇవ్వలేదు.

అందుకే చాలా రోజుల తర్వాత.. గత 8 నెలల నుంచి ఆయన ఆధ్వర్యంలో వాళ్ల టీమ్ ముందు నా మీద దాడులు చేశారు. డబ్బులు ఇచ్చి నాకు వ్యతిరేకంగా జ్యోతిష్యులను అలాగే కొంతమంది క్లైంట్స్ రూపంలో ఉండే వ్యక్తులను తీసుకొచ్చారు. నా గురించి టీవీల్లో డిబేట్ కూడా పెట్టి చెడు ప్రచారం చేయడానికి తీవ్రమైన ప్రయత్నాలు ప్రముఖ జర్నలిస్ట్ చేస్తున్నారు. ఎంతోమందిని నేను కష్టాల నుంచి బాధల నుంచి బయటపడేలా చేశాను. నాకు చివరకు నేనే ఆత్మహత్య చేసుకునే వరకు వెళ్లాను. 8 నెలల నుండి 15 కేజీల బరువు కూడా తగ్గిపోయాను. దీనంతటికీ కారణం ఓ ఆడియో కారణం అని అన్నారు. అయితే ఈ ఆడియోలో ఏముందంటే.. 5 కోట్లు డిమాండ్ చేశాడు.

అయితే ఐదు కోట్లు ఎక్కడి నుంచి తెచ్చి ఇస్తారు ఇవ్వలేం అమర్ అని వీణా అంటుంది. వాళ్లు అంత అడుగుతున్నారు. నువ్వు ఎంత ఇవ్వగలవో లేదో చెప్పు అని అమర్ అన్నారు. వేణు స్వామి కూడా నమ్మలేరు. ఐదు కోట్లు ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వాలి అమర్.మనం ఇంకా ఆయన నుండి సమాచారం వినలేదు కాబట్టి కిల్లార్ రాజేష్‌కు ఈ మెసేజ్ పంపిద్దాం అని చెబుదాము అంటుంది. అప్పుడు అతను నువ్వు చేయగలిగిందేంటో చెప్పు అంటాడు. ఆయన నా మాటని నమ్ముతాడా అనే ఆలోచనలో ఉన్నాను. ఆయన దగ్గర అంత డబ్బు కూడా లేదు. ఇందులో కొంతమంది వేణు స్వామి మీద దాడి చేయాలని ప్లాన్ చేశారు’’ అని చెప్పుకొచ్చారు. ప్రజెంట్ ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అయితే అది చూసిన కొందరు వేణుస్వామికి సపోర్ట్ చేస్తే మరికొందరు పలు రకాలుగా కామెంట్లు పెడుతున్నారు.

(Video Link Credits to veenasrivani Instagram Channel)

Advertisement

Next Story

Most Viewed