- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Keerthy Suresh: ఇంటికి వచ్చి మరీ మ్యారేజ్ ప్రపోజల్ చేశాడు.. ఎట్టకేలకు పెళ్లిపై స్పందించిన మహానటి
దిశ, సినిమా: అందాల ముద్దుగుమ్మ కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ బ్యూటీ తన అందం, అభినయంతో అందరినీ ఆకట్టుకుంటుంది. ‘నేను శైలజ’ మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ అమ్మడు మహానటి సినిమాతో స్టార్ హీరోయిన్‌గా మారడమే కాకుండా మంచి గుర్తింపు సంపాదించుకున్నది. దీంతో ఈ భామకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. ఇక అన్ని సినిమాలకు ఓకే చేసి నటించి మంచి ఫేమ్ తెచ్చుకుంది. ప్రస్తుతం ‘రఘు తాత’ అనే మూవీలో నటిస్తోంది..
ఇదిలా ఉంటే కీర్తి సురేష్‌కు లేటెస్ట్‌గా ‘దసరా’ సినిమాలో వెన్నెల పాత్రకు గాను ఫిల్మ్ ఫేర్ అవార్డ్ వచ్చిన సంగతి తెలిసిందే.. శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్‌లో నాని హీరోగా నటించిన ఈ మూవీలో కీర్తి.. వెన్నెల పాత్రలో ఆమె చేసిన నటనకు ఆడియన్స్ ఫిదా అయ్యారు. అయితే తనకు ఫిల్మ్ ఫేర్ వచ్చిన సందర్భంగా కీర్తి సురేష్ ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో తనకు వచ్చిన ఒక పెళ్లి ప్రపోజల్ గురించి చెప్పి షాక్ ఇచ్చింది. ఆమె మాట్లాడుతూ.. “నన్ను అభిమానించే ఒక వ్యక్తి నా ఇంటికి వచ్చి పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. అతన్ని చూసి ముందు భయపడ్డా కానీ, తర్వాత అతను నాపై చూపించే అభిమానం ప్రేమ నచ్చాయి. సినీ తారలుగా తాము పడుతున్న కష్టానికి ఇలా అభిమానుల నుంచి చెప్పలేనంత ప్రేమ వస్తుంది. దీని కోసం ఎంత కష్టపడినా పర్వాలేదని అనిపిస్తుంది” అంటూ కీర్తి సురేష్ చెప్పుకొచ్చింది.
కాగా రీసెంట్‌గా చిరంజీవి, విజయ్‌లలో బెస్ట్ డాన్సర్‌గా విజయ్‌ని ఎంపిక చేసుకున్నందుకు కీర్తి సురేష్ మీద విపరీతమైన ట్రోల్స్ వస్తున్నాయి. చిరంజీవి డాన్స్‌ని వేరొకరితో పోల్చేంత పెద్ద దానివా అంటూ మెగా ఫ్యాన్స్ ఆమె మీద ఫైర్ అవుతున్నారు.