Raj Tarun: రాజ్ తరుణ్ కారణంగా మూవీ బిజినెస్ లాస్ అయిందా..? దర్శకనిర్మాతలు ఏం అన్నారంటే?

by sudharani |
Raj Tarun: రాజ్ తరుణ్ కారణంగా మూవీ బిజినెస్ లాస్ అయిందా..? దర్శకనిర్మాతలు ఏం అన్నారంటే?
X

దిశ, సినిమా: రాజ్ తరుణ్ లేటెస్ట్ మూవీ ‘పురుషోత్తముడు’. రామ్ భీమన దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హాసిని సుధీర్ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు వచ్చిన టీజర్, ట్రైలర్, పాటలకు మంచి స్పందన లభించింది. ఇక జూలై 26న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్న ‘పురుషోత్తముడు’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను తాజాగా నిర్వహించారు చిత్రబృందం. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్‌కు ‘రాజ్ తరుణ్ కారణంగా ‘పురుషోత్తముడు’ బిజినెస్ లాస్ అయిందా?’ అనే ప్రశ్న ఎదురైంది.

దీనిపై మూవీ డైరెక్టర్ రామ్ భీమన, నిర్మాత రమేశ్ స్పందిస్తూ.. ‘రాజ్ తరుణ్ వ్యక్తిగత కారణాల చేత ఈ ఈవెంట్‌కు రాలేకపోయాడు. వీడియో బైట్ పంపిస్తా అన్నారు. కానీ కొన్ని డేస్ ఆయన దగ్గర ఫోన్ లేకపోవడం వల్ల అది కూడా కాలేదు. వ్యక్తిగత కారణాలు పక్కన పెడితే సినిమా కోసం 100శాతం న్యాయం చేశారు. ఇక ప్రేక్షకులు చాలా గొప్పగా ఆలోచిస్తారు. మూవీలో కంటెంట్, నటీనటుల యాక్టింగ్ చూసి మూవీని ఆదరిస్తారు. ఒక సినిమా తీస్తున్నారు అంటే దాని వెనుక దాదాపు 2 వేల మంది కష్టపడి పనిచేస్తారని ఆడియన్స్‌కు తెలుసు. ఇక బిజినెస్ విషయంలో కూడా మేము ఎలాంటి అంచనాలు పెట్టుకోలేదు. అది పూర్తిగా క్వాలిటీపై ఆధారపడి ఉంటుంది. అంతే కాకుండా ‘పురుషోత్తముడు’ టీజర్, ట్రైలర్, పాటలకు సోషల్ మీడియాలో మిలియన్స్‌లో వ్యూస్ వచ్చాయి. ఈ మూవీ ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని మేము ఆశిస్తున్నాము’ అంటూ చెప్పుకొచ్చారు.

Advertisement

Next Story