హ్యాపీ బర్త్ డే క్యూటీ సమంత.. రామ్ చరణ్-సామ్ రేర్ ఫొటో షేర్ చేసిన చిత్రబృందం

by Disha Web Desk 9 |
హ్యాపీ బర్త్ డే క్యూటీ సమంత.. రామ్ చరణ్-సామ్ రేర్ ఫొటో షేర్ చేసిన చిత్రబృందం
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ సమంత గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన అక్కర్లేదు. తన నటన, అందం, అభినయం, అదిరిపోయే డాన్స్‌తో ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుందనడంలో అతిశయోక్తిలేదు. మొదటి సినిమాతోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్‌గా గుర్తింపు సంపాదించుకున్న టాలెంటెడ్ హీరోయినని చెప్పుకోవచ్చు. తర్వాత టాలీవుడ్ అగ్ర హీరోల సరసన నటించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది. అంతేకాకుండా కోట్లలో భారీ ఫ్యాన్స్ ఫాలోయింగ్‌ను సంపాదించుకోవడం విశేషం. అయితే నేడు ఈ ముద్దుగుమ్మ పుట్టిన రోజును గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటోంది. కాగా ఈ సందర్భంగా రంగస్థలం చిత్రబృందం ఆమెకు ప్రత్యేకంగా విషెస్ చెప్పింది. రంగస్థలం షూటింగ్ సమయంలోనే ఒక అరుదైన ఫొటోను సోషల్ మీడియాలో పోస్టు చేసి బర్త్ విషెస్ చెప్పింది. ఈ ట్వీట్‌ను రామ్ చరణ్ ఫ్యాన్స్ రీట్వీట్ చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు. అలాగే రంగస్థలం రామలక్ష్మికి జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు.

Read More..

బిగ్‌బాస్ నేహకు ప్రమాదం.. హెల్త్ అప్డేట్ ఇస్తూ కన్నీరు పెట్టుకుంటున్న వీడియో షేర్ చేయడంతో ఆందోళనలో ఫ్యాన్స్



Next Story

Most Viewed