Hansika Motwani యోగా భంగిమలు చూస్తే మతిపోవాల్సిందే.. ఎంత అందంగా ఉందో!

by Anjali |   ( Updated:2023-06-22 11:06:43.0  )
Hansika Motwani యోగా భంగిమలు చూస్తే మతిపోవాల్సిందే.. ఎంత అందంగా ఉందో!
X

దిశ, సినిమా: గ్లామరెస్ బ్యూటీ హన్సిక మోత్వానీ బ్యూటీఫుల్ పిక్‌తో నెటిజన్లను అట్రాక్ట్ చేసింది. జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పలువురు సెలబ్రిటీలు తమదైన స్టైల్‌లో యోగాసనాల ప్రాధాన్యతను తెలియజేయగా.. హన్సిక కూడా తనవంతు పాత్ర పోషించింది. ఈ మేరకు ఉదయాన్నే తన ఇంటి గార్డెన్‌లో బ్లూ అండ్ యాష్ కలర్ జిమ్ వేర్‌లో దర్శనమిచ్చిన బ్యూటీ.. పచ్చటి గడ్డిలో పరదావేసి యోగాసనాలతో అదరగొట్టేసింది. మొదట ధనురాసనంతో మొదలుపెట్టి వక్రాసనం, చక్రాసనాలు ఫర్‌ఫెక్ట్‌గా చేసిన నటి.. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టా వేదికగా పోస్ట్ చేస్తూ ‘ఇంటర్నేషనల్ యోగా డే. టుడే అండ్ ఎవ్రీడే’ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. ఈ పిక్స్ ప్రస్తుతం వైరల్ అవుతుండగా ‘చాలా ఫ్రెష్‌గా ఉన్నావ్’ అంటూ నటి అందాలను నెటిజన్లు పొగిడేస్తున్నారు.

Click Here for Hansika Motwani Instagram Link

Advertisement

Next Story