- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Cancer: క్యాన్సర్ బాధితులకు అండగా స్టార్ నటి.. అమ్మ పేరుతో ఫౌండేషన్
దిశ, సినిమా : ప్రముఖ నటి హంసానందిని క్యాన్సర్ బాధితులకు సాయం చేసేందుకు ముందుకొచ్చింది. గతంలో ఏడాది కాలంగా రొమ్ము క్యాన్సర్ మహమ్మారితో ఒంటరి పోరాటం చేసి దాన్ని జయించిన ఆమె.. మహిళా దినోత్సవం సందర్భంగా తల్లిపేరుతో క్యాన్సర్ ఫౌండేషన్ స్థాపించినట్లు తెలిపింది. ‘బ్రెస్ట్ క్యాన్సర్‌తో చాలా పోరాటం చేశా. ప్రస్తుతం నేను జీవించి మీ ముందు ఉన్నందుకు దేవుడికి కృతజ్ఞతలు తెలుపుతున్నా. నా కీమోథెరపీ సమయంలో ప్రతి క్షణాన్ని నా చివరిదిగానే భావించా. అందేకే నేను చూసిన దానికంటే మరింత మెరుగ్గా ఈ ప్రపంచాన్ని చూడాలని వాగ్దానం చేసుకున్నా. దానికి తగ్గట్టుగానే రొమ్ము క్యాన్సర్ బారిన పడి మరణించిన నా తల్లి పేరు మీద ‘యామినీ క్యాన్సర్ ఫౌండేషన్’ని నెలకొల్పుతున్నా. ఈ విషయం మీతో చెప్పడానికి సంతోషిస్తున్నా. రొమ్ము క్యాన్సర్ నిర్వహణ, చికిత్సకు సంబంధించిన అన్ని అంశాల గురించిన సమాచారాన్ని భారతదేశం అంతటా ప్రజలకు సులభంగా అందుబాటులో ఉంచడమే నా లక్ష్యం. అని తెలిపింది.
ఇవి కూడా చదవండి : డైరెక్టర్లుగా అదరగొట్టి స్టార్ హీరోయిన్స్ వీళ్లే!