శరీరాన్ని అవమానించే మాటలు.. ఎవరికీ చెప్పుకోలేకపోతున్నా

by Prasanna |   ( Updated:2023-04-22 13:26:19.0  )
శరీరాన్ని అవమానించే మాటలు.. ఎవరికీ చెప్పుకోలేకపోతున్నా
X

దిశ, సినిమా : జస్టిన్ బీబర్ వైఫ్ అండ్ మోడల్ హేలీ బీబర్.. కొంతకాలంగా తాను మెంటల్ స్ట్రెస్‌కు గురవుతున్నట్లు తెలిపింది. 2023 మొదలైనప్పటినుంచి తన జీవితంలో అత్యంత విచారకరమైన, కష్టమైన క్షణాలు చోటుచేసుకున్నాయంటూ ఎమోషనల్ అయింది. ‘నా మనస్సులోని భావోద్వేగాలు బయటకు చెప్పలేనంత క్లిష్టంగా ఉన్నాయి. నాపై ద్వేషపూరితమైన ప్రచారం జరుగుతోంది. బికినీ ఫొటోల విషయంలో శరీరాన్ని అవమానించే వ్యాఖ్యలు ఇబ్బందిపెడుతున్నాయి. నా లాంటి బాధలను చాలా మంది అనుభవిస్తున్నారని నాకు తెలుసు. కొన్నిసార్లు మన ప్రాబ్లమ్స్ మనకు హాస్యాస్పదంగా కనిపిస్తాయి. అయినప్పటికీ కష్టసమయాల్లో మనం ఒంటరిగా లేమని తెలుసుకోవాలి. ఒకరి కోసం మరొకరం నిలబడుతూనే ప్రియమైన స్నేహితులు, కుటుంబ సభ్యుల కోసం ఇక్కడే ఉందాం. ప్రజలకు అండగా ఉందాం. మనం కలిసి మెలసి ఉందాం’ అంటూ తన ఫీలింగ్స్ షేర్ చేసుకుంది.

Also Read.: ఇంటి గుమ్మం ముందు ఆ సింబల్స్.. నటికి షాక్‌ ఇచ్చిన అభిమాని


Advertisement

Next Story

Most Viewed