డెలివరీ టైమ్‌లో తీవ్రమైన చలి, వణుకు ఎందుకు వస్తుందో తెలుసా?

by Prasanna |   ( Updated:2023-05-19 15:21:43.0  )
డెలివరీ టైమ్‌లో తీవ్రమైన చలి, వణుకు ఎందుకు వస్తుందో తెలుసా?
X

దిశ, ఫీచర్స్: చాలామంది మహిళలు డెలివరీ టైమ్‌లో, ప్రసవానంతరం తీవ్రమైన చలి, వణుకు సమస్యను ఎదుర్కొంటారు. కొందరికి 20 నుంచి 30 నిమిషాలపాటు ఇది కొనసాగితే, మరికొందరికి ఒకటి నుంచి రెండు గంటల దాకా ఈ ప్రాబ్లం ఉంటుంది. దాదాపు సగం మంది మహిళలు గంట నుంచి 2 గంటల వరకు ఈ సమస్యను ఎదుర్కొంటున్నట్లు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. అందుకే ప్రెగ్నెన్సీ, చైల్డ్ బర్త్ అనేది మహిళలకు శారీరకంగా, మానసికంగా ఒక సవాలు లాంటిది. ఒక పేషెంట్ గడ్డకట్టే శీతకాలపు చలిలో కోటు ధరించకుండా బయటకు వెళ్తే ఎలా ఉంటుందో, మహిళలు ప్రసవానంతరం అటువంటి అనుభూతితో కూడిన తీవ్రమైన చలి, వణుకు, దంతాలు కొరకడం వంటి పరిస్థితిని ఎదుర్కొంటారని గైనకాలజిస్టులు అంటున్నారు. దీనిని వైద్య పరిభాషలో ప్రసవానంతర చలి (Called postpartum chills) అని పిలుస్తారు. డెలివరీ సమయంలో ఎదురయ్యే ఈ సాధారణ సమస్య ఎందుకు వస్తుంది? నిపుణులు ఏం చెప్తున్నారో పరిశీలిద్దాం.

కారణాలివే..

* హార్మోన్ల మార్పులు: ప్రసవం తర్వాత, స్త్రీ శరీరంలో హార్మోన్ల హెచ్చుతగ్గులు తీవ్రంగా ఉంటాయి. ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ లెవల్స్ సడెన్‌గా తగ్గిపోవడం, అలాగే ఇతర హార్మోన్లలో మార్పులు వంటివి చలి, వణుకులను ప్రేరేపిస్తాయి.

* మెటబాలిజం పెరగడం: ప్రెగ్నెన్సీ అండ్ చైల్డ్ బర్త్ జీవక్రియ రేటు పెరగడానికి దారితీస్తుంది.ఈ ఎలివేటెడ్ మెటబాలిజం, ప్రసవ సమయంలో శారీరక శ్రమతోపాటు, శరీరం అదనపు వేడిని ప్రొడ్యూస్ చేయడానికి కారణం కావచ్చు. ఫలితంగా అదనపు వేడిని వెదజల్లడానికి శరీరం వణుకు లేదా చలితో ప్రతిస్పందిస్తుంది.

* అలసట : ప్రసవ ప్రక్రియ శారీరకంగా, మానసికంగా ప్రభావితం చేస్తుంది. వేడిని ఉత్పత్తి చేయడానికి, శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడానికి ఒక మార్గంగా వణుకుతున్నప్పుడు శరీరం అలసటకు గురవుతుంది.

* ఒత్తిడి, ఆందోళన : ప్రసవానంతర కాలం చాలా మంది మహిళలకు అధిక ఒత్తిడిని, మానసిక ఆందోళనను కలిగిస్తుంది. ఈ భావోద్వేగ కారకాలు వణుకు, చలితో సహా శారీరక ప్రతిస్పందనను ప్రేరేపిస్తాయి.

* మందులు, అనస్థీషియా: ప్రసవ సమయంలో ఉపయోగించే కొన్ని మందులు, అనస్థీషియా చలి, వణుకు సహా ఇతర దుష్ప్రభావాలు కలిగి ఉండవచ్చు. ఇబ్బందులు కనిపిస్తే డాక్టర్లు తక్షణమే నివారణ చర్యలు సూచిస్తారు.

* డీ హైడ్రేషన్ : ప్రసవించడం అనేది శారీరకంగా ఒత్తిడితో కూడిన డిమాండింగ్ ప్రాసెస్‌గా ఉంటుంది. ఇది ఫ్లూయిడ్ కోల్పోవడానికి దారితీస్తుంది. డీ హైడ్రేషన్ వణుకు, చలికి, అలాగే ఇతర లక్షణాలకు దోహదం చేస్తుంది. ప్రసవానంతరం చలి, వణుకు సమస్య ఎదురైనప్పటికీ ఇది ప్రమాదకరం కాదని, తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా అధిగమించవచ్చని గైనకాలజిస్టులు అంటున్నారు.

ఈ జాగ్రత్తలు తీసుకోవాలి

ప్రసవం తర్వాత చలి, వణుకు సమస్యను ఎదుర్కోవడానకి వెచ్చటి దుస్తులు ధరించడం, దుప్పటి కప్పుకోవడం చేయాలి. అవసరమైతే హీటింగ్ ప్యాడ్‌లు, వెచ్చటి కంప్రెస్‌లను ఉపయోగించాలి. అలాగే హైడ్రేటెడ్‌గా ఉండేందుకు గోరు వెచ్చని నీళ్లు, సూప్స్, వంటివి తీసుకోవాలి. అలసట చలికి దోహదం చేస్తుంది కాబట్టి ప్రసవానంతర కాలంలో తగినంత రెస్ట్ అవసరం. సెల్ఫ్ కేర్‌కు ప్రయారిటీ ఇవ్వాలి. ప్రసవానంతర చలి తీవ్రంగా లేదా నిరంతరంగా ఉంటే, వాడుతున్న మందులను మార్చాల్సి ఉంటుందేమో డాక్టర్లను అడిగి తెలుసుకోవాలి.

ఇవి కూడా చదవండి:

ప్లీజ్.. నన్ను రెండో భార్యగా ఉంచుకో..! అతడి పొందు కోసం తహతహలాడుతున్న యువతి చివరికి

Advertisement

Next Story

Most Viewed