- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘Gudumba Shankar’ రీ రిలీజ్.. Pawan kalyan పై Meera Jasmine ఆసక్తికర పోస్ట్
దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టిన రోజు సెప్టెంబర్2న ఉండటంతో ఆయన అభిమానులు వేడుకలకు రేడీ అవుతున్నారు. అయితే పవన్ బర్త్ డే సందర్భంగా పవర్ స్టార్ కెరీర్‌లో స్పెషల్ మూవీగా నిలిచిన గుడుంబా శంకర్‌ను రీ రిలీజ్ చేస్తున్నారు. ఆగస్టు 31 న ఈ సినిమా థియేటర్లలో సందడి చేయనున్నట్లు నిర్మాత నాగబాబు ఇదివరకే వెల్లడించారు. వీర శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో పవన్, సరసన మీరాజాస్మిన్ హీరోయిన్‌గా నటించింది.
తాజాగా గుడుంబా శంకర్ రీ రిలీజ్‌పై మీరా జాస్మిన్ తన ఇన్‌స్టా్గ్రామ్‌లో ఓ స్పెషల్ పోస్ట్ పెట్టింది. అందరికీ నమస్కారం.. పవన్ కల్యాణ్ పుట్టిన రోజును పురస్కరించుకుని గుడుంబా శంకర్ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు. ఇది నాకెంతో ప్రత్యేకమైన సినిమా. పవన్ కల్యాణ్‌తో కలిసి పనిచేయడం నాకో అద్భుతమైన అనుభవం. ఈ సినిమా షూటింగ్‌ను మేము చాలా ఎంజాయ్ చేశాం. కామెడీ సీన్స్, సాంగ్స్ షూట్ చేస్తున్నప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. ఈ సినిమా రిలీజై 20 ఏళ్లు గడిచాయంటే అసలు నమ్మశక్యంగా లేదు. ఇన్నేళ్ల తర్వాత రీ రిలీజ్ రూపంలో మళ్లీ అంతే ప్రేమను అందిస్తున్నారు. అందరికీ ధన్యవాదాలు. పవన్ కల్యాణ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు. అలాగే నిర్మాత నాగబాబు డైరెక్టర్ వీర శంకర్, ఇతర చిత్ర యూనిట్ సభ్యులందరికీ ఆల్ ది బెస్ట్’’ అంటూ రాసుకొచ్చింది.
ఇవి కూడా చదవండి : ఈ వారం OTT, థియేటర్లలో విడుదలయ్యే సినిమాలు ఇవే..