కీరవాణి, చంద్రబోస్‌లకు ఘన సన్మానం.. టీఎఫ్‌సీసీ ప్రెస్‌ నోట్ రిలీజ్

by Aamani |   ( Updated:2023-04-08 10:22:38.0  )
కీరవాణి, చంద్రబోస్‌లకు ఘన సన్మానం.. టీఎఫ్‌సీసీ ప్రెస్‌ నోట్ రిలీజ్
X

దిశ, సినిమా : ‘తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్’ గౌరవ కార్యదర్శి కె.ఎల్. దామోదర్ ప్రసాద్ శనివారం ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ప్రముఖ సంగీత దర్శకుడు సుస్వర వాణి శ్రీ ఎమ్.ఎమ్ కీరవాణి, సరస్వతి పుత్రులు గేయరచయిత శ్రీ చంద్రబోస్‌లకు సన్మానం చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. ఈ మేరకు ‘నాటు నాటు’ పాటకు గాను ప్రతిష్టాత్మక ఆస్కార్ రావడాన్ని పురస్కరించుకుని ఏప్రిల్ 9న సాయంత్రం 6:00 గంటలకు హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో తెలుగు సినీ పరిశ్రమ వారిని ఘనంగా సత్కరించనున్నట్లు తెలిపారు. ఈ సన్మాన కార్యక్రమంలో సినీ పరిశ్రమకు సంబంధించిన నటీనటులు, నిర్మాతలు, దర్శకులు, రచయితలు, సాంకేతిక నిపుణులు హాజరుకానున్నారు. తెలుగు సినిమాను ప్రేమించే ఆహూతులైన ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమం ఒక మంచి జ్ఞాపకం, గర్వించ దగిన ఉత్సాహం కానుందని దామోదర్ పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి: ‘జబర్దస్త్’ షో నుంచి వెళ్లిపోయిన ఇంద్రజ!




Advertisement

Next Story