గుడ్ న్యూస్.. ఓటీటీలోకి వచ్చేసిన న్యూ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

by Kavitha |
గుడ్ న్యూస్.. ఓటీటీలోకి వచ్చేసిన న్యూ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్: తమిళ స్టార్ హీరో నటించిన తాజా మూవీ ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’. వెంకట్‌ ప్రభు దర్శకత్వం వహించిన యాక్షన్‌ థ్రిల్లర్ అయిన ఈ మూవీ.. రీసెంట్​గా థియేటర్లలో విడుదలై మిక్స్​డ్​ టాక్ అందుకుంది. ఈ చిత్రంలో విజయ్‌తో పాటు మీనాక్షి చౌదరి, స్నేహ నటించారు. త్రిష స్పెషల్ సాంగ్‌లో అలరించింది. ఇదిలా ఉంటే, ఈ మూవీ ఓటీటీలో విడుదలైంది. నేటి నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగుతో పాటు తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. కాగా బాక్సాఫీసు దగ్గర ఈ మూవీ రూ.450 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. మరి ఇంకెందుకు ఆలస్యం ఇప్పటిదాక ఈ సినిమా చూడని వాళ్ళు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అయినటువంటి నెట్‌ఫ్లిక్స్‌లో చూసేయండి.

Next Story

Most Viewed