- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Manchu Vishnu: నా చిత్రపరిశ్రమను బాధపెట్టాలని చూస్తే నేను మౌనంగా ఉండను.. మంచు విష్ణు షాకింగ్ కామెంట్స్!
దిశ, వెబ్ డెస్క్ : హీరోయిన్ సమంత, చైతూ డివోర్స్ పై తెలంగాణ మినిస్టర్ కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు నెట్టింట దుమారం రేపుతోంది. బుధవారం మీడియాతో మాట్లాడుతూ కొండా సురేఖ బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ను విమర్శించే నేపథ్యంలో సమంత, నాగచైతన్య పేర్లను తెరపైకి తెచ్చి .. కేటీఆర్ వల్లే సమంత విడాకులు తీసుకుందంటూ ఆరోపణలు చేసింది. సినీ ప్రముఖులు సురేఖ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. తాజగా, ఈ వ్యాఖ్యలను " మా "అధ్యక్షుడు మంచు విష్ణు ఖండించాడు.
" మేము నటులుగా ప్రజల దృష్టిలో ఎప్పుడూ ఉంటాం, కానీ మా కుటుంబ విషయాలు వ్యక్తిగతం. మిగిలిన అందరి కుటుంబాల్లాగే వారికి కూడా గౌరవం, రక్షణ అవసరం. ఎవరూ తమ కుటుంబ సభ్యులు టార్గెట్ అవ్వడం, అబద్దపు ఆరోపణలలోకి లాగబడటం ఇష్టం పడరు. అదే విధంగా మేము కూడా మా కుటుంబాలకు ఆ గౌరవం ఇవ్వాలని కోరుకుంటున్నాం. పరిశ్రమ తరపున, నేను మా కుటుంబాలకు అనవసరమైన, హానికరమైన పరిస్థితుల నుంచి దూరంగా ఉంచమని వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాను. నా చిత్రపరిశ్రమను ఎవరు బాధపెట్టాలని చూస్తే నేను మౌనంగా ఉండను. మేము ఇలాంటి దాడులను తట్టుకోం. మేమంతా ఏకమై నిలబడతమంటూ " మంచు విష్ణు ట్వీట్ పెట్టాడు.