మనస్థాపంతో వ్యక్తి ఆత్మహత్య

by Sridhar Babu |
మనస్థాపంతో వ్యక్తి ఆత్మహత్య
X

దిశ, తంగళ్లపల్లి : మనస్థాపానికి గురైన వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల గ్రామంలో చోటు చేసుకుంది. శుక్రవారం మండలంలోని జిల్లెల్ల గ్రామంలో గల రాముల వారి బండ వద్ద ఎండీ. అన్ను అనే వ్యక్తి మనస్థాపానికి గురై చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతునికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఒక కుమారుడు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story