The Adipurush Update We Expect Teaser Of Prabhas Film On. October 2

by Hamsa |   ( Updated:2022-09-27 08:54:53.0  )
The Adipurush Update We Expect Teaser Of Prabhas Film On. October 2
X

దిశ, సినిమా: ఓం రౌత్‌ దర్శకత్వంలో రామాయ‌ణం నేప‌థ్యంలో తెర‌కెక్కిన చిత్రం 'ఆదిపురుష్'. ఈ మూవీలో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించనున్నాడు. ఈయనకు జోడీగా సీత పాత్రలో కృతి స‌నన్ నటించింది. ఈ సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకుని పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులలో బిజీగా ఉంది. ఈ క్రమంలో దసరా సందర్భంగా అప్ డేట్ ఇవ్వనుంది మూవీ యూనిట్. అక్టోబర్‌ 2న అయోధ్యలో 'ఆదిపురుష్‌' ఫస్ట్‌ లుక్‌‌తో పాటు టీజర్‌ను విడుదల చేయనున్నట్లు అధికారికంగా ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. దీంతో ప్రభాస్‌ అభిమానులు సంబురాలు చేసుకుంటున్నారు. దాదాపు రూ.500 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన ఈ చిత్రం వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా జ‌న‌వరి 12న విడుద‌ల కానుంది.

ఇవి కూడా చదవండి : వరుస సినిమాలు చేయకపోవడానికి కారణం అదే.. Hrithik Roshan

Advertisement

Next Story