పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. పిఠాపురం ప్రజలకు ప్రభాస్ పెద్దమ్మ కీలక మెసేజ్ (వీడియో)

by Hamsa |   ( Updated:2024-05-11 14:43:28.0  )
పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. పిఠాపురం ప్రజలకు ప్రభాస్ పెద్దమ్మ కీలక మెసేజ్ (వీడియో)
X

దిశ, సినిమా: గత ఎన్నికలతో పోలిస్తే ఈ సారి హాట్ హాట్‌గా మారాయి. రెండు రోజుల్లోనే పోలింగ్ ఉండటంతో అన్ని పార్టీల నాయకులు ప్రచారాల్లో ఫుల్ బిజీ అయిపోయారు. అయితే పిఠాపురం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న పవన్ కల్యాణ్‌కు సినీ ఇండస్ట్రీ నుంచి చాలా మంది మద్దతుగా నిలుస్తున్నారు. అంతేకాకుండా కొందరు ఆయన కోసం ప్రచారంలో కూడా పాల్గొంటూ ఆయనను గెలిపించే ప్రయత్నాలు చేస్తున్నారు. రోజు రోజుకు పవన్ కల్యాణ్ క్రేజ్ మరింత పెరుగుతుండటంతో సినీ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోయిన్, హీరోలు నటీనటులు ఆయనకు సపోర్ట్‌గా నిలుస్తున్నారు.

తాజాగా, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పెద్దమ్మ శ్యామలా దేవి కూడా ఆయనకు మద్దతు తెలిపింది. అంతేకాకుండా కీలక మెసేజ్ ఇచ్చి ఫ్యాన్స్ ఆనందానికి కారణమైంది. ప్రస్తుతం శ్యామలా దేవికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. అందులో ఆమె మాట్లాడుతూ.. ‘‘పిఠాపురంలో అత్యధిక మెజారిటీతో మన పవన్ కల్యాణ్ గెలుపు ఖాయం అయిపోయింది.

చాలా మంది అక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు పవన్ కల్యాణ్ ఘన విజయం సాధిస్తాడు. పిఠాపురం ప్రజలందరూ కూడా ఎంత మెజారిటీ ఇస్తారో అది రాష్ట్రంలోనే నెంబర్ వన్ మెజారిటీ అవుతుంది. పవన్ కల్యాణ్‌కు వస్తుందని నేను ఆశిస్తున్నాను. అది 100 శాతం జరుగుతుంది. జై మోడీ, జై తెలుగుదేశం, జై జనసేన’’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో చూసిన ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతూనే పవన్ గెలిస్తే మాముల్‌గా ఉండదని అంటున్నారు.

Read More...

ప్రభాస్ ‘కల్కి’ సినిమాపై ఎన్నికల ఎఫెక్ట్.. చర్చనీయాంశంగా మారిన నిర్మాత పోస్ట్!



Advertisement

Next Story