పవన్ ఫ్యాన్స్‌కు శుభవార్త.. అప్పుడే వచ్చేస్తున్న 'హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు'

by sudharani |
పవన్ ఫ్యాన్స్‌కు శుభవార్త.. అప్పుడే వచ్చేస్తున్న హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు
X

దిశ, సినిమా: పవన్ కళ్యాణ్ ప్రెస్టీజియస్‌ ప్రాజెక్ట్ 'హరి హర వీరమల్లు' 17వ శతాబ్దం నాటి కథాంశంతో తెరకెక్కుతోంది. క్రిష్ దర్శకత్వంలో వస్తున్న సినిమాలో పవర్ స్టార్.. చాణక్యుడి తెలివితేటలు, తెనాలి రామకృష్ణుడి హాస్యచతురత కలబోసిన క్యారెక్టర్‌లో కనిపించనున్నాడు. ఈ మధ్య ఈ చిత్రం షూటింగ్ ఆగిపోయినట్లు వార్తలొచ్చినా.. అందులో నిజం లేదని, బిగ్ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతున్న సినిమా కావ‌డంతోనే షూటింగ్ ఆల‌స్యమ‌వుతున్నట్లు స్పష్టం చేశాడు దర్శకుడు. 2023 మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలిపాడు. నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్న మూవీ.. పవన్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలుస్తుందని అంటున్నారు మేకర్స్.

Advertisement

Next Story