మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. రామ్ చరణ్ బర్త్‌డే కానుకగా ఆ సినిమా రీరిలీజ్

by Hamsa |   ( Updated:2023-03-18 06:04:33.0  )
మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. రామ్ చరణ్  బర్త్‌డే కానుకగా ఆ సినిమా రీరిలీజ్
X

దిశ, వెబ్ డెస్క్: మెగా హీరో రామ్ చరణ్ అనేక చిత్రాల్లో నటించి స్టార్ హీరోగా రాణిస్తున్నాడు. ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్‌గా మారి ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేశాడు. ‘నాటు నాటు’ పాటతో తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నాడు. అయితే 2010లో విడుదలైన ‘ఆరెంజ్’ సినిమాను మార్చి 27న రామ్ చరణ్ బర్త్‌డే సందర్భంగా రీ రిలీజ్ చేయనున్నట్లు నిర్మాత నాగబాబు ప్రకటించాడు.

అంతేకాకుండా ఈ సినిమాకు వచ్చే కలెక్షన్స్‌ను జనసేన పార్టీకి విరాళంగా ఇస్తానని తెలిపాడు. అయితే మెగా అభిమానుల కోరిక మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. దీంతో అది చూసిన మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా, ఈ మూవీ ఈ సారైనా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో లేదో చూడాలి.

Also read: విరాట్ కోహ్లి బ‌యోపిక్‌లో న‌టించాలనుందన్న.. రామ్‌చ‌ర‌ణ్..

Advertisement

Next Story