రిలీజ్‌కు రెడీ అయిన 'సఖి'.. బాణ మేస్తున్న కీర్తీ..

by Disha News Desk |
రిలీజ్‌కు రెడీ అయిన సఖి.. బాణ మేస్తున్న కీర్తీ..
X

దిశ, వెబ్‌డెస్క్: మహానటి హోదా అందుకున్న కీర్తి సురేష్ సరికొత్త కథలను ఓకే చూస్తూ దూసుకెళుతోంది. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలకు అమ్మడు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. అయితే కీర్తి సురేష్ తాజాగా చేసిన సినిమా 'గుడ్ లక్ సఖి'. ఈ సినిమాలో కీర్తి చాలా కొత్తగా కనిపించనుంది. నిజానికి ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనా లాక్‌డౌన్స్ కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఇందులో కీర్తి షూటర్‌గా కనిపించనుంది. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న 'సఖి'లో ఆది పినిశెట్టి, జగపతి బాబు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.

అయితే తాజాగా ఈ సినిమా రిలీజ్‌ డేట్ ప్రకటిస్తూ పోస్టర్‌ను విడుదల చేశారు. సినిమా ఈ నెల జనవరి 28న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందని పేర్కొన్నారు. ఇక పోస్టర్ విషయానికొస్తే ఇందులో కీర్తి సురేష్ బాణం వేస్తూ కనిపిస్తోంది. అంతే వెనకాల జగపతి బాబు కూడా బాణం వేస్తున్నాడు. ఆది, రాహుల్ రామకృష్ణ కూడా కనిపిస్తున్నారు. ఈ పోస్టర్‌‌లోని సన్నివేశం అంతా ఏదో నాటకంలో ఉన్నట్లుగా ఉంది. మరి ఈ సినిమాతో కీర్తి ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో మెప్పిస్తుందో లేదో చూడాలి.

Advertisement

Next Story