‘థ్యాంకూ రాఘవేంద్రరావు సార్’.. నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోన్న అభిమాని గ్లింప్స్

by Anjali |
‘థ్యాంకూ రాఘవేంద్రరావు సార్’.. నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోన్న అభిమాని గ్లింప్స్
X

దిశ, వెబ్‌డెస్క్: సోషల్ మీడియాలో ఫుల్ పాపులారిటీ దక్కించుకున్న జర్నలిస్ట్, ప్రొడ్యూసర్, నటుడు సురేష్ కొండేటి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ప్రస్తుతం ఈయన నటించిన అభిమాని చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. భూలోకం, యమలోకం చుట్టూ తిరిగే నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్ర గ్లింప్ల్ తాజాగా విడుదల అయింది. అయితే నేడు సురేష్ కొండేటి బర్త్ డే సందర్భంగా టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ రాఘవేంద్రరావు చేతుల మీదుల గ్లింప్స్ విడుదల చేశారు. ఈ సందర్భంగా రాఘవేంద్రరావు మాట్లాడుతూ.. ‘అభిమాని గ్లింప్స్ చాలా బాగుందని తెలిపారు. తనకు బాగా నచ్చిందని అన్నారు. అలాగే టైటిల్ కూడా బాగుంది, ఆరోగ్యకరంగా ఉందని.. ఇక సురేష్ రాఘవేంద్రరావుకు జర్నలిస్టుగా ఉన్నప్పుడే తెలుసునని వెల్లడించారు. సురేష్ గురించి చెప్పాలంటే తేన ప్రయాణం ఒక అద్భుతమని కొనియాడారు. ఒక జర్నలిస్ట్ గా, నటుడిగా, డిస్ట్రిబ్యూటర్‌గా, నిర్మాతగా ఇలా ఎదగడం చాలా గర్వంగా అనిపిస్తుందని చెప్పుకొచ్చారు.

సురేష్ ఎదిగిన తీరు రాఘవేంద్రకు హ్యాపీగా అనిపిస్తుందని వెల్లడించారు. అభిమాని చిత్రం మంచి హిట్ అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని.. మూవీ టీమ్‌కు రాఘవేంద్రరావు ఆల్ ది బెస్ట్ చెప్పారు. తర్వాత సురేష్ కొండేటి మాట్లాడారు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుతో తన పరిచయం కొన్ని దశాబ్దాల నాటిదని తెలిపాడు. స్టూడెంట్ నంబర్-1 చిత్రానికి డిస్ట్రిబ్యూటర్ గా చేశానని అన్నాడు. అలా తర్వాత నిర్మాతగా.. ఇప్పుడు నటుడిగా.. ఫిల్మ్ జర్నలిస్ట్ గా తనను సినీ పరిశ్రమలో నిలబడేలా చేసిందని సురేష్ కొండేటి పేర్కొన్నారు. ఇక ఈ మూవీలో యముడిగా నటించిన ఘోష్.. కథానాయికగా అక్సాఖాన్ నటించారు. గ్లింప్స్ విడుదల సందర్భంగా వీరు తాము నటించిన సినిమా గ్లింప్స్ రాఘవేంద్రరావు చేతుల మీదుగా రిలీజ్ అవ్వడం చాలా సంతోషకరమని అన్నారు. ప్రముఖ డైరెక్టర్ కు థాంక్యూ సార్ అని తెలియజేశారు. ప్రస్తుతం అభిమాని చిత్ర గ్లింప్స్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది.


Advertisement

Next Story

Most Viewed