- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ విషయం చాలా బాధపెడుతుందంటూ సింగర్ గీతా మాధురి ఎమోషనల్ కామెంట్స్..(వీడియో)
దిశ, వెబ్‌డెస్క్: స్టార్ గీతా మాధురి తన పాటతో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది. ఆమె ఎన్నో పాటలు పాడి ఫ్యాన్స్ ఫాలోయింగ్‌ను పెంచుకుంది. అటు సినిమాల్లో పాటలు పాడుతునే... బుల్లితెరపై ప్రసారమవుతున్న షోస్ కి మెంటర్ గా కూడా వ్యవహారిస్తుంది. నటుడు నందును ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరిద్దరికి ఓ కూతురు కూడా ఉంది. అయితే గీతా మాధురి గత కొద్ది కాలంగా ఇండస్ట్రీకి దూరమైనప్పటికీ నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ఇటీవల గీతా మాధురి, భర్తతో విడాకులు తీసుకోబోతుందని నెట్టింట చర్చ జరిగింది. ఈ విషయంపై ఆమె భర్త నందు స్పందించి క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
తాజాగా, గీతా మాధురి తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఆసక్తికర వీడియోను షేర్ చేసింది. ఇందులో పెళ్లి చేసుకుని ప్రశాంతంగా ఉన్న జంటలపై సొసైటీ కన్సర్న్ వలన చాలా స్ట్రెస్ పడుతోందని చెప్పుకొచ్చింది. ‘‘ఓ విషయం నన్ను చాలా బాధపెడుతుంది. ప్రత్యేకంగా ఇప్పుడు ఉన్న తరంలో, జీవనశైలి, ఆహార నాణ్యత, పని సమయాలు, ఒత్తిడి, వాతావరణ మార్పులు, కాలుష్యంలో వస్తున్న మార్పుల కారణంగా బాడీలో కూడా చేంజెస్ వచ్చేస్తున్నాయి. కాబట్టి పిల్లల్ని కనడం అనేది ఈరోజుల్లో పెద్ద టాస్క్ లా మారిపోయింది. నేను పెళ్ళై ఇంకా పిల్లలు పుట్టని ఐదు జంటలతో మాట్లాడాను. వాళ్లు చాలా స్ట్రెస్ లో ఉన్నారు. దానికి తోడు వాళ్ళ మీద సొసైటీ ప్రెజర్. సోసైటికి అంత కన్సర్న్ ఉంటే.. వెటకారంగా మాట్లాడకండి. యే మీకు పిల్లలు లేరా.. ఇంకా ఎప్పుడు కంటారు. ఎప్పుడు డబ్బు సంపాదనేనా.. పిల్లలు కనండి, డాక్టర్స్ కి చూపించుకోండి.. ఇలా అంటారు. ఇవన్నీ వాళ్లకు తెలీదా. ఈ ప్రశ్నల వలన జంటలపై ప్రెజర్ పడుతుంది. చుట్టాలు, సొసైటీ కపూల్స్ ను కంగారు పెడుతుంటారు. ఇలాంటి జంటలకు నేను చెప్పేది ఏంటంటే సోసైటీ ప్రెజర్ లో పడి.. మీరు ఒత్తిడికి లోను కాకండి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. అందరూ అడిగే వాళ్లు జాగ్రత్తగా మాట్లాడండి. నాకు ఎందుకో చెప్పాలి అనిపించింది’’ అని చెప్పుకొచ్చింది.
- Tags
- geetha madhuri