‘తకిట తదిమి తందాన’.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్

by Vinod kumar |
‘తకిట తదిమి తందాన’.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్
X

దిశ, సినిమా: ఘన ఆదిత్య, ప్రియ జంటగా వస్తున్న చిత్రం ‘తకిట తదిమి తందాన’. రాజ్ లోహిత్ తెరకెక్కిస్తున్న సినిమాను ఎల్లో మాంగో ఎంటర్‌టైన్మెంట్, వ్యాస స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కాగా తాజాగా మేకర్స్ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌ని విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత చందన్ కుమార్ మాట్లాడుతూ.. ‘మా సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయింది. ఇదొక వెరైటీ కథ. మంచి ఎమోషన్ ఉంటుంది. కెమెరామెన్‌గా అర్జున్, రైటర్‌గా దిలీప్ కుమార్, ఎడిటర్‌గా జానీ బాషా, మ్యూజిక్ డైరెక్టర్‌గా అభిషేక్ రుఫుస్, స్టిల్స్ బన్నీ సంగరాజ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా సాయి కిరణ్ రెడ్డి వంటి అత్యున్నత సాంకేతిక బృందం చిత్రానికి పని చేశారు. త్వరలో సినీ ప్రముఖుల సమక్షంలో టీజర్ రిలీజ్ చేస్తాం’ అన్నాడు.

Advertisement

Next Story