- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Taapsee Pannu: ఎంగేజ్‌మెంట్ అయిన 9 ఏళ్లకు పెళ్లి చేసుకున్నా.. షాకింగ్ విషయాలు రివీల్ చేసిన స్టార్ హీరోయిన్
దిశ, సినిమా: స్టార్ బ్యూటీ తాప్సీ పన్ను భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తోంది. అంతేకాకుండా సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ పలు పోస్టులతో నెట్టింట రచ్చ చేస్తోంది. ఇక తాప్సీ పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. గత కొద్ది కాలంగా బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బోను మార్చి 23న పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని అధికారికంగా మాత్రం ప్రకటించలేదు. కానీ సోషల్ మీడియాలో పెళ్లికి సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ అయిపోయారు. అంత సీక్రెట్‌గా పెళ్లి చేసుకోవడానికి కారణాలెంటో అని పలు రకాలుగా చర్చించుకున్నారు. కానీ తాప్సీ మాత్రం ఎన్ని పుకార్లు వచ్చినా కానీ రియాక్ట్ కాలేదు. ఇక ఇటీవల ఈ అమ్మడు నటించిన ఫిర్ ఆయీ హసీన్ దిల్రూబా సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో ఆగస్టు 9వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అందుబాటులోకి వచ్చింది.
అయితే ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తాప్సీ వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ బిజీ బిజీగా గడుపుతోంది. ఈ క్రమంలో.. తన పెళ్లికి సంబంధించి షాకింగ్ విషయాలు వెల్లడించి అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ‘‘ నాకు మథియాస్ 11 ఏళ్ల ముందు తెలుసు. అయితే పరిచయం అయ్యాక మొదట్లో ఒక ఏడాది డేటింగ్ చేశాము. ఫస్ట్ డేట్ మాత్రం దుబాయ్‌కి వెళ్లాము. ఆ తర్వాత అతను నాకు ప్రపోజ్ చేశాడు. ఇక అప్పుడే నేను ఓకే చేశాను. దీంతో ఇరు కుటంబ సభ్యులు కూడా ఒప్పుకోవడంతో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాము. కానీ పెళ్లి మాత్రం నిశ్చితార్థం అయిన 9 ఏళ్లకు చేసుకున్నాం.
అయితే ఇన్ని సంవత్సరాలు అయినా మేము కలిసే ఉండటానికి కారణం మా ఇద్దరి మధ్య ఉన్న ప్రేమనే’’ అని చెప్పుకొచ్చింది. దీంతో అంతా షాక్ అవుతున్నారు. ఎందుకంటే.. ఇటీవల ప్రేమ పెళ్లిళ్లు చేసుకుంటున్న ఎంతో మంది విడాకులు తీసుకుని విడిపోతున్న విషయం తెలిసిందే. అలాగే కొందరు ప్రేమను ఇంట్లో వాళ్లు ఒప్పుకున్నాక ఎంగేజ్‌మెంట్ జరిగిన తర్వాత కూడా మనస్పర్థలు వచ్చి విడిపోతున్నారు. అలాంటిది ఇన్నేళ్లు వీరిద్దరు కలిసి ఉండటం గ్రేట్ అని ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు.
- Tags
- Taapsee Pannu