పవర్ అండ్ మ్యాజిక్ కోసం సిద్ధంగా ఉండండి.. హైప్ పెంచేస్తున్న డైరెక్టర్ ట్వీట్

by sudharani |   ( Updated:2024-10-08 12:46:49.0  )
పవర్ అండ్ మ్యాజిక్ కోసం సిద్ధంగా ఉండండి.. హైప్ పెంచేస్తున్న డైరెక్టర్ ట్వీట్
X

దిశ, సినిమా: టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ‘హనుమాన్’ చిత్రంతో ఒక్కసారిగా పాన్ ఇండియా రేంజ్‌లో గుర్తింపు తెచ్చుకున్నాడు. తేజాసజ్జా హీరోగా నటించిన ఈ మూవీ సంక్రాంతి సందర్భంగా థియేటర్లలో రిలీజై మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా.. బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ. 300 కోట్లు రాబట్టి బ్లాక్ బస్టర్ హిట్‌ను సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే.. ప్రశాంత్ వర్మ క్రియేట్ చేసిన సినిమాటిక్ యూనివర్స్‌లో ఏకంగా 10 సూపర్ హీరో సినిమాలు తీస్తానని గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే PVCU సినిమాటిల్ యూనివర్స్‌లో వరుస సినిమాలు అనౌన్స్ చేస్తున్నాడు ప్రశాంత్ వర్మ. ఈ మేరకు PVCUలో ఇప్పటికే ‘హనుమాన్’ కు సీక్వెల్‌గా ‘జై హనుమాన్’ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. అలాగే.. కల్యాణ్ దాసరి హీరోగా ‘అదీరా’ అనే సినిమాను ప్రకటించగా.. మోషన్ పోస్టర్ సైతం రిలీజ్ చేశారు. ఆ తర్వాత నందమూరి మోక్షజ్ఞ హీరోగా మూవీని అనౌన్స్ చేశారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ అప్‌డేట్ ఇచ్చాడు ప్రశాంత్ వర్మ.

ఈ మేరకు ‘ఈ నవరాత్రి సందర్భంగా పవర్ అండ్ మ్యాజిక్ చూసేందుకు సిద్ధంగా ఉండండి. అక్టోబర్ 10న PVCU 3 పైన ఇంటరెస్టింగ్ అప్డేట్ ఉండబోతుంది. రాబోయే అప్డేట్ కోసం మీరు నాలాగే ఉత్సాహంగా ఉన్నారని భావిస్తున్నాను’ అంటూ క్యాప్షన్ ఇచ్చి ఓ షార్ట్ వీడియోను షేర్ చేశారు. ఇక ఈ వీడియో ఆధారంగా చూసుకుంటే.. ఇది కళ్యాణ్ దాసరి హీరోగా తెరకెక్కుతోన్న ‘అధీరా’ గురించి కావచ్చు, లేదంటే ‘జై హనుమాన్’ పైన కావచ్చు అంటూ రిప్లై ఇస్తున్నారు నెటిజన్లు. ఏ సినిమాపై అప్‌డేట్ వస్తుందా అనేది తెలియాలంటే మరో రెండు రోజులు వేచి ఉండాల్సి ఉంది.

Advertisement

Next Story