‘మహానటి’ సినిమాలో మానాన్న గురించి తప్పుగా చూపించారు.. జెమినీ గణేశన్ కుమార్తె వ్యాఖ్యలు

by sudharani |   ( Updated:2023-05-31 12:54:16.0  )
‘మహానటి’ సినిమాలో మానాన్న గురించి తప్పుగా చూపించారు.. జెమినీ గణేశన్ కుమార్తె వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ‘మహానటి’ సినిమా గురించి అందరికి తెలిసిందే. అలనాటి అందాల తార దివంగత సావిత్రి జీవిత చరిత్రను ‘మహానటి’ చిత్రంగా తెరకెక్కించారు. అందులో సావిత్రి సినిమాల్లోకి ఎలా వచ్చింది.. జెమినీ గణేశన్‌ను ఎలా పెళ్లిచేసుకుంది.. నమ్మిన వాళ్లతోనే సావిత్రి ఎలా మోసపోయింది.. చివరికి ఆమె ఎలా చనిపోయింది అనేది మొత్తం ఆ చిత్రంలో చిత్రీకరించారు. ఇదిలా ఉంటే.. ‘మహానటి’ సినిమా గురించి తాజాగా జెమినీ గణేశన్ కుమార్తె కమల గణేశన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కమల గణేశన్ మాట్లాడుతూ.. ‘మా డాడీ చాలా అందంగా ఉంటారు. ముఖ్యంగా ఆయన హెయిర్ స్టైల్ చాలా బాగుండేది. డాడీ, పిల్లలందరినీ ఎంతో ప్రేమగా చూసుకునే వారు. ప్రతీ రోజు కూడా మా డాడీని చూసేందుకు చాలా మంది అమ్మాయిలు వచ్చేవారు. తమని పెళ్లి చేసుకోమని అడిగేవారు. కానీ.. నాకు పెళ్లి అయిందంటూ వారు నచ్చచెప్పి అక్కడ నుంచి పంపించేసేవారు. కానీ, సావిత్రిని పెళ్లి చేసుకోవడం విధిరాతగానే చెప్పుకోవాలి. అయితే, పెళ్లి చేసుకుందామని డాడీ ఎవరినీ ఫోర్స్ చేయలేదు. మా డాడీకి మంచి స్టార్ ఇమేజ్ ఉంది. ఆయనకు అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్నట్లు ‘మహానటి’ సినిమాలో చూపించిన దాంట్లో నిజం’ అంటూ చెప్పుకొచ్చారు.

Also Read.

అంతా అయోమయంగా ఉంది.. రీ ఎంట్రీపై మీరా జాస్మిన్

Advertisement

Next Story