నాటు నాటు సాంగ్‌పై గరికపాటి వ్యాఖ్యలు వైరల్

by sudharani |   ( Updated:2023-07-28 06:13:46.0  )
నాటు నాటు సాంగ్‌పై గరికపాటి వ్యాఖ్యలు వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: దర్శకధీరుడు రాజమౌళి ప్రతిస్టాత్మంగా తెరకెక్కించిన సినిమా ‘ఆర్ఆర్ఆర్’. ఈ మూవీ రిలీజై ఏడాది గడుస్తున్నప్పటికీ ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు. ఇప్పటికే ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్న ఆర్ఆర్ఆర్.. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు పాట ఆస్కార్‌కు నామినేట్ అయిన విషయం తెలిసిందే. దీంతో.. రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ పేర్లు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగుతున్నాయి. ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్‌ను సాధించిన నాటు నాటు సాంగ్‌పై ప్రపంచ వ్యాప్తంగా ప్రసంశలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ క్రమంలోనే గరికపాటి నరసింహారావు సైతం తన ప్రవచనంలో నాటు నాటు పాటను ప్రస్తావించారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘అచ్చ తెలుగులో రాసిన పాట నాటు నాటు ఆస్కార్‌కు నామినేట్ అవ్వడం సంతోషించాల్సిన విషయం. ఆ ఇద్దరు నటులు చేసిన అద్భుతమైన నటన.. కీరవాణి సంగీతం.. రాజమౌళి దర్శకత్వం కారణంగా.. ఈ రోజు ప్రపంచ స్థాయి బహుమతి రాబోతుంది. దీనికి మనం సంతోషించాలి’’ అంటూ చెప్పుకొచ్చారు. కాగా.. గరికపాటి వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed