పక్కా ప్లాన్‌తో ‘గ్యాంగ్స్ ఆఫ్‌ గోదావరి’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్..!

by sudharani |
పక్కా ప్లాన్‌తో ‘గ్యాంగ్స్ ఆఫ్‌ గోదావరి’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్..!
X

దిశ, సినిమా: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ‘గామి’ మూవీ తర్వాత.. ‘గ్యాంగ్స్ ఆఫ్‌ గోదావరి’ తో బిజీగా ఉన్నాడు. కృష్ణ చైతన్య దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో నేహా శెట్టి హీరోయిన్‌గా నటించగా.. అంజలి కీలక పాత్ర పోషించనుంది. షికర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫర్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విశ్వక్ సేన్ మాస్, రస్టిక్ రోల్‌లో కనిపించనున్న ఈ మూవీకి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. ఇందులో నుంచి ఇప్పటికే విడుదలైన ప్రతి అప్‌డేట్ ఆకట్టుకోగా.. ‘ఫస్ట్ సింగిల్’కు సోషల్ మీడియాలో మంచి క్రేజ్ వచ్చింది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్‌పై అప్‌డేట్ వచ్చింది.

అయితే.. ఈ మూవీ గతేడాదే రిలీజ్ కావాల్సి ఉంది. కానీ, అప్పటికి షూటింగ్ పనులు పూర్తి కానీ కారణంగా అప్పుడు వాయిదా పడింది. తర్వాత ‘గామి’ సినిమా రిలీజ్‌కు సిద్ధంగా ఉండటంతో మరో సారి ఈ చిత్రం విడుదల వాయిదా వేశారు మేకర్స్. కానీ ఈసారి మాత్రం పక్కా ప్లాన్‌తోనే విడుదలకు సిద్ధంగా ఉన్నారు చిత్ర బృందం. మే 13న తెలంగాణ, ఏపీలో ఎన్నికలు పూర్తవుతాయి అన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఎలక్షన్ల హడావిడి పూర్తి అయిపోతే.. ప్రజలు రిలాక్ష్ మూడ్‌లో ఉంటారు. ఈ టైంలోనే సినిమా రిలీజ్ పెట్టుకుంటే మంచిదని భావించిందట మూవీ టీం. దీంతో మే 17న విడుదలకు సిద్ధం అయ్యారు. దీనికి సంబంధించిన అన్ని పనులు పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా.. ఈ సినిమా అయిన విశ్వక్ మంచి ఫలితం ఇస్తుందో లేదో వేచి చూడాల్సి ఉంది.

Read More..

నాగార్జున వద్దు ఇంట్రెస్ట్ లేదన్నా బలవంతంగా అది నేర్పాడు.. స్టార్ హీరోయిన్ కామెంట్స్ వైరల్!

Advertisement

Next Story