Ram Charan: ‘రా మచ్చా మచ్చా’ సాంగ్ ప్రోమో రిలీజ్.. మాస్ స్టెప్స్‌తో అదరగొట్టిన రామ్ చరణ్

by Hamsa |
Ram Charan: ‘రా మచ్చా మచ్చా’ సాంగ్ ప్రోమో రిలీజ్.. మాస్ స్టెప్స్‌తో అదరగొట్టిన రామ్ చరణ్
X

దిశ, సినిమా: రామ్ చరణ్, శంకర్ కాంబోలో గత రెండున్నరేళ్ల నుంచి తెరకెక్కుతున్న మూవీ ‘గేమ్ చేంజర్’. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుండగా.. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మాస్ బీట్స్ అందిస్తున్నాడు. దీనిని భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీగా దిల్ రాజ్ నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా 2024 క్రిస్మస్ సందర్భంగా తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, కన్నడ వంటి భాషల్లో విడుదల కాబోతుంది.

ఇప్పటికే ‘గేమ్ చేంజర్’ నుంచి విడుదలైన పోస్టర్స్, జరగండి సాంగ్ భారీ హైప్‌ను క్రియేట్ చేసింది. అయితే ఇటీవల తమన్ ‘గేమ్ చేంజర్’ రా మచ్చా మచ్చా సాంగ్ రాబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా, ఈ పాట ప్రోమోను మేకర్స్ సెప్టెంబర్ 28న విడుదల చేశారు. అలాగే పూర్తి పాట సెప్టెంబర్ 30న రిలీజ్ కానున్నట్లు తెలిపారు. అయితే విడుదలైన ప్రోమోలో రామ్ చరణ్ మాస్ స్టెప్స్‌తో అదరగొట్టాడు. పూనకాలు తెప్పించేలా ఉంది థియేటర్స్‌లో ఈ సాంగ్‌కి రచ్చ రచ్చ కావాల్సిందే అని మెగా ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.



Advertisement

Next Story

Most Viewed