- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Kalki 2898 AD: కల్కి మూవీపై మాజీ ఉపరాష్ట్రపతి ప్రశంసల వర్షం.. హాలీవుడ్ సినిమా అంటూ స్పెషల్ ట్వీట్
దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబోలో తెరకెక్కిన సైంటిఫిక్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’. ఈ మూవీలోని యాక్షన్ సీన్స్, విజువల్స్, మహాభారతం సీన్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. 600 కోట్ల బడ్జేట్‌తో రూపొందించిన ఈ మూవీ ఇప్పటికే 1000 కోట్ల గ్రాస్‌ను క్రాస్ చేసేసింది. ఇక ఇప్పటికే ఈ మూవీ చూసిన సెలెబ్రిటీలు తమదైన శైలిలో స్పందించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా మన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ‘కల్కి’ మూవీని వీక్షించి ఈ చిత్రం పై ప్రశంసల వర్షం కురిపిస్తూ X ద్వారా ఓ స్పెషల్ ట్వీట్ చేశారు.
ఈ ట్వీట్‌లో భాగంగా.. “ఈరోజు శ్రీ నాగ్ అశ్విన్ గారి దర్శకత్వంలో శ్రీ అశ్వినీ దత్ గారు నిర్మించిన కల్కి 2898 ఏడీ చలనచిత్రాన్ని వీక్షించాను. మహాభారత ఇతిహాసం స్ఫూర్తితో , మహాభారతంలోని పాత్రలతో రూపొందించిన ఈ ఫిక్షన్ థ్రిల్లర్ మంచి అనుభూతిని కలిగించింది. సాంకేతికంగా చాలా ఉన్నతంగా ఈ సినిమాను నిర్మించారు. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపిక పదుకొణె తదితర భారీ తారాగణంతో రూపొందించిన ఈ చలనచిత్ర నిర్మాణం హాలీవుడ్ నిర్మాణానికి ఏమాత్రం తీసిపోని విధంగా ఉంది. ఇది అంతర్జాతీయ స్థాయి సినిమా. దర్శకుడు శ్రీ నాగ్ అశ్విన్, నిర్మాత శ్రీ అశ్వినీ దత్ సహా ఈ చలనచిత్ర రూపకల్పనలో పాలుపంచుకున్న భాగస్వాములందరికీ అభినందనలు” అంటూ వెంకయ్యనాయుడు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది.