- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘భారతీయన్స్’ సినిమాపై మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రశంసలు
X
దిశ, వెబ్‌డెస్క్: దేశ సమైక్యత, భారతీయ సైనికుల వీరగాథను తెలియజేస్తూ ఇటువంటి మంచి దేశభక్తి సినిమా తీయడం అభినందనీయమని ‘భారతీయన్స్’ చిత్రబృందాన్ని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అభినందించారు. నీరోజ్ పుచ్చా, సోనమ్ టెండప్, సుభా రంజన్, మహేందర్ బర్గాస్ హీరోలుగా.. సమైరా సందు, రాజేశ్వరి చక్రవర్తి, పెడెన్ నాంగ్యాల్ హీరోయిన్లుగా నటించిన సినిమా ‘భారతీయన్స్’.
ఈ చిత్రాన్ని వెంకయ్య నాయుడు ఆదివారం ఉదయం ప్రసాద్ లాబ్స్‌లో ప్రత్యేకంగా వీక్షించారు. ప్రీమియర్ అనంతరం చాలా మంచి సినిమా తీశారని చిత్ర బృందాన్ని ఆయన అభినందించారు. ప్రేక్షకులు తప్పకుండా ఈ సినిమాను ప్రోత్సహించాలన్నారు. దర్శక నిర్మాతలు యువతకు చక్కటి సినిమా అందిస్తున్నారని హర్షించారు. చాలా సంతోషం. దేశభక్తి చిత్రాలను యువత, ప్రేక్షకులు చూడాలని కోరుకుంటున్నాను’’ అని అన్నారు.
Advertisement
Next Story