- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జపాన్‌లో రష్మిక ఫ్యాన్స్ రచ్చ.. శ్రీవల్లి ఖాతాలో అరుదైన రికార్డ్!
దిశ, సినిమా: అగ్ర హీరోల సరసన నటిస్తూ స్టార్ డమ్ సంపాదించుకుంది హీరోయిన్ రష్మిక మందన్న. రీసెంట్ గా సందీప్ వంగా దర్శకత్వంలో తెరకెక్కిన యానిమల్ చిత్రంలో రణబీర్ సరసన నటించి తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ చిత్రంపై పలు రకాల ట్రోల్స్ వచ్చినా.. బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. దాదాపు 900 రూపాయల కోట్ల భారీ కలెక్షన్లను రాబట్టి రికార్డు సృష్టించింది.
ప్రస్తుతం ఈ అమ్మడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప-2 ’ లో నటిస్తోంది. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటోంది. మొదటి పార్ట్ లో శ్రీవల్లి రోల్ లో నటించి.. ప్రేక్షకుల్ని మంత్రముగ్దుల్ని చేసింది. ఇక రెండో పార్ట్ లో శ్రీవల్లీని చూడడం కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే శ్రీవల్లి పాత్ర కేవలం మన భారతీయులకే కాకుండా ఫారెన్ కంట్రీస్ వారికి కూడా బాగా నచ్చింది. రష్మిక నిన్న టోక్యోలో జరగనున్న క్రంచీ రోల్ అనిమే అవార్డ్స్‌కు హాజరయ్యేందుకు ముంబై విమానాశ్రయం నుంచి టోక్యోకు బయలుదేరింది.
రష్మిక టోక్యోలో అడుగుపెట్టగానే జపాన్‌కు చెందిన ఆమె ఫ్యాన్స్ పుష్ప శ్రీవల్లి ఫోటోతో స్వాగతం పలికారు. తాము చూపిస్తున్న ప్రేమ, అభిమానం చూసి రష్మిక ఒక్కసారిగా షాక్ అయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అలాగే రష్మిక మరో ఘనత సాధించింది. క్రంచీ రోల్ అనిమే అవార్డ్స్‌కు హాజరైన ఇండియా నుంచి మొదటి సెలబ్రిటీ రష్మిక కావడం విశేషం. దీంతో అభిమానులు సోషల్ మీడియా వేదికన రష్మికు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.