అవిసె గింజలతో ఆరోగ్యం.. సక్రమంగా వాడకుంటే సమస్యలు తప్పవు !

by Prasanna |   ( Updated:2023-05-08 08:36:02.0  )
అవిసె గింజలతో ఆరోగ్యం.. సక్రమంగా వాడకుంటే సమస్యలు తప్పవు !
X

దిశ, ఫీచర్స్ : అవిసె గింజలను(flax seed) సరైన ప్రాసెస్‌లో తీసుకోకపోతే, వాటిలోని పోషకాల నుంచి పూర్తి ప్రయోజనాలను పొందలేరని, జీర్ణక్రియ సమస్యలు తలెత్తవచ్చని డైటీషియన్లు చెప్తున్నారు. సూపర్‌ఫుడ్‌గా పేర్కొనే ఈ గింజలతో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో, జీర్ణ వ్యవస్థను మెరుగుపర్చడంలో, మంటను, అధిక బరువును తగ్గించడంలో సహాయపడతాయి. అలాగే స్కిన్, హెయిర్ ప్రొటెక్షన్‌ను ఇస్తాయి. పీసీఓ‌ఎస్, ఇర్రెగ్యులర్ పీరియడ్ సమస్యలను దూరం చేస్తాయి. ఫైటోఈస్ట్రోజెన్ పుష్కలంగా ఉండటంవల్ల హార్మోన్ల సమతుల్యతకు దోహదం చేస్తాయి. ఫైటోస్టెరాల్ కలిగి ఉన్న కారణంగా శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ వాటిని ఆహారంగా తీసుకునే విధానం సక్రమంగా లేకపోతే ఉపయోగం ఉండదని పోషకాహార నిపుణులు చెప్తున్నారు. చాలామంది పచ్చివి తింటే ఆరోగ్యానికి మేలు చేస్తుందని అపోహ పడుతుంటారు. కానీ అలా చేయడం మంచిది కాదు. జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. అందుకే వాటిని వేయించి, రుబ్బుకోవడం ద్వారా వాడాలి. అవిసె గింజలను మెత్తగా, పొడిగా చేసి వాడటంవల్ల శరీరం పోషకాలను మరింత సమర్థవంతంగా గ్రహించగలుగుతుంది.

Read more:

వేసవిలో దొరికే బీరకాయ తినడం వలన మనకి కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే!

Advertisement

Next Story

Most Viewed