సరిగ్గా ఇదేరోజు.. బాక్సాఫీస్‌ను షేక్ చేసిన రామ్ చరణ్

by GSrikanth |   ( Updated:2023-03-31 13:45:21.0  )
సరిగ్గా ఇదేరోజు.. బాక్సాఫీస్‌ను షేక్ చేసిన రామ్ చరణ్
X

దిశ, వెబ్‌డెస్క్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రామ్ చరణ్ కెరీర్‌లోనే బెస్ట్ సినిమాగా నిలిచిపోయింది. ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద రామ్ చరణ్ తన సత్తా ఏంటో అభిమానులకు చూపించాడు. డే వన్ నుంచే అద్భుతమైన కలెక్షన్లు రాబట్టిన ఈ చిత్రం ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ కెరీర్‌లోనే అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. అయితే, ఈ సినిమా విడుదలై నేటికి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా చిత్రబృందం మరోసారి సోషల్ మీడియా వేదికగా అభిమానులకు ధన్యవాదాలు చెప్పారు. ప్రత్యేక పోస్టర్‌తో ‘తెలుగు చిత్రసీమలో కల్ట్ మూవీగా మారిన ఒక గ్రామీణ కథ’ అనే క్యాప్షన్‌తో ట్వీట్ చేశారు. కాగా, ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన సమంత నటించగా, సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ దీనికి దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాలో జగపతి బాబు, ఆది పినిశెట్టి కీలక పాత్రల్లో నటించారు.

Advertisement

Next Story