సూపర్ స్టార్ రజినీకాంత్ ‘తలైవర్ 171’ నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్..

by Disha Web Desk 7 |
సూపర్ స్టార్ రజినీకాంత్ ‘తలైవర్ 171’ నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్..
X

దిశ, సినిమా: ‘జైలర్’ సినిమాతో గతేడాది బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం ‘తలైవర్ 171’ మూవీతో బిజీగా ఉన్నాడు. తమిళ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్ బ్యానర్‌పై సుభాస్కరణ్ నిర్మిస్తున్నారు. ఇక రానా దగ్గుబాటి, ఫహద్ ఫాజిల్, రితికా సింగ్, మంజు వారియర్, దుషార విజయన్ ముఖ్యపాత్రల్లో కనిపించనున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు.

ఈ సినిమా నుంచి అప్ డేట్స్ కోసం అభిమానులు ఎంతో ఈగర్‌గా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశాడు తమిళ స్టార్ హీరో ధనుష్. ఈ పోస్టర్‌లో రజినీ కాంత్ బంగారు వాచీలతో చెయ్యబడిన సంకెళ్లతో దర్శనమిచ్చాడు. ఇక ఇందులో రజినీకాంత్ నవ్వుతూ కనిపించగా.. వెనుక భాగంలో కూడా ఓ వాచ్ ఉండటం విశేషం. అంటే ఈ సినిమా కథ వాచ్‌ల చుట్టూ తిరుగుతుందని అర్థం అవుతోంది. కాగా.. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.


Next Story