ఎట్టకేల‌కు విక్రమ్ ‘ధృవ న‌క్షత్రం’ మూవీ విడుదల తేదీని ప్రకటించిన మేకర్స్..

by Kavitha |
ఎట్టకేల‌కు విక్రమ్ ‘ధృవ న‌క్షత్రం’ మూవీ విడుదల తేదీని ప్రకటించిన మేకర్స్..
X

దిశ, సినిమా: మొత్తానికి హీరో విక్రమ్ నటించిన ‘ధృవ న‌క్షత్రం’ మూవీ ఓ కొలిక్కి వ‌చ్చింది అన్నీ అడ్డంకుల‌ను దాటుకుని విడుద‌ల‌కు సిద్ధమైంది. అప్పుడెప్పుడో 2013లో స్టార్ డైరెక్టర్ గౌత‌మ్ వాసుదేవ్ మీన‌న్ ప్రారంభించిన ఈ సినిమాకు మొదలెట్టినప్పటి నుండి అన్నీ ఇబ్బుందులే ఎదురయ్యాయి.. ముందు సూర్య హీరోగా ఈ చిత్రాన్ని స్టార్ట్ చేశారు. కానీ మ‌ధ్యలోనే సూర్య ఈ ప్రాజెక్టు నుంచి త‌ప్పుకోవ‌డంతో, 2015లో ఆ స్థానంలోకి జ‌యం ర‌విని తీసుకుని కొంత‌మేర షూట్ కూడా చేశారు. కానీ జ‌యం ర‌వి కూడా మిడిల్‌లోనే వెళ్లిపోవ‌డంతో విక్రమ్‌తో మ‌ళ్లీ మొద‌లు పెట్టారు. అదే విధంగా హీరోయిన్ విష‌యంలోనూ సేమ్ ఇలానే జ‌రిగింది త్రిష, నయనతార, సమీరారెడ్డి, అసిన్, అను ఇమ్మాన్యుయేల్, అమలా పాల్ అంటూ అర డజను మంది కథానాయికలకు పైగానే ఈ సినిమాలోకి వ‌చ్చి వెళ్లిపోగా చివ‌ర‌కు రీతూ వ‌ర్మ ఓకే అయింది. అలా హీరోహీరోయిన్లు మారినప్పుడల్లా రీ షూట్లు చేస్తూ వ‌చ్చారట.

ముఖ్యంగా దర్శకుడు గౌతమ్ మీననే ఈ చిత్ర నిర్మాత కావ‌డంతో ఆర్థిక స‌మ‌స్యల కారణంగా డ‌బ్బులు కూడిన‌ప్పుడ‌ల్లా షూటింగ్ చేసుకుంటూ వచ్చాడు. చాలా దేశాల్లో ఈ సినిమా చిత్రీక‌రించాల్సి రావ‌డం, అదే స‌మ‌యంలో క‌రోనా తాండ‌వం ఇలా స‌మ‌స్యల‌న్నీ చుట్టు ముట్టాయి. దీనిని నుంచి బ‌య‌ట ప‌డేందుకు.. ఆయ‌న డైరెక్ట్‌గా న‌ట‌న‌లోకి దిగి వ‌రుస‌గా చిత్రాల‌లో యాక్ట్ కూడా చేసి వచ్చిన డబ్బులతో మొత్తనికి ఈ సినిమా కంప్లిట్ చేసిన గౌతమ్. ఇక తాజాగా అందరు ఎప్పటి నుండో ఎదురుచూస్తున్నా ఈ మూవీ విడుద‌ల తేదిని ప్రక‌టించారు. ఈ మార్చి 29న ప్రపంచ వ్యాప్తంగా త‌మిళంతో పాటు తెలుగు, మ‌ల‌యాళ‌, క‌న్నడ భాష‌ల్లో విడుద‌ల చేయ‌నున్నట్లు తెలిపారు మెకర్స్.


Advertisement

Next Story

Most Viewed