- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పోల్ షేక్ చేసిన బాలయ్య... Unstoppable With NBK అంటోన్న ఫ్యాన్స్
దిశ, వెబ్‌డెస్క్ : ఒక ఈవెంట్ సక్సెస్ అవ్వాలన్నా... ఓ షో టాప్ రేటింగ్స్ లో నిలవాలన్నా యాంకర్స్ పైనే ఆధారపడి ఉంటుంది. బ్యాగ్రౌండ్ లో ఎంతమంది వర్క్ చేసినా.. హోస్ట్ చేసేవాళ్ళు స్పాంటేనియస్ గా లేకపోతే ఆ ప్రోగ్రాం ఫెయిలైనట్టే. అందుకే యాంకరింగ్ చేసేవాళ్ళు సమయస్ఫూర్తితో, మాటల గారడీతో ప్రేక్షకులను కట్టిపడెయ్యాలి. అప్పుడే ఆ షో పాపులారిటీ పెరుగుతుంది. అయితే ఒకప్పుడు హోస్ట్స్ అంటే కేవలం ప్రొఫెషనల్స్ మాత్రమే ఉండేవారు. ఇప్పుడు ఆ ప్లేస్ ని ఓవర్ టేక్ చేసేస్తున్నారు సినిమా నటులు. జనాలు కూడా ఈ మార్పుని బాగా ఆదరిస్తున్నారు.
తెలుగు షోస్ నాగార్జున, చిరంజీవి, ఎన్టీఆర్, నాని టెలివిజన్ షోస్ లను హోస్ట్ చేసి మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. OTT వేదికగా రానా, సమంత, నందమూరి బాలకృష్ణ కూడా హోస్ట్స్ గా మంచి ఇమేజ్ సంపాదించారు. కాగా ట్విట్టర్ వేదికగా ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్ ఓ పోల్ నిర్వహించింది. ఆహా లో హోస్ట్స్ గా చేసిన నలుగురిలో ఎవరు మీ ఫేవరెట్ హోస్ట్ అంటూ పోల్ కండక్ట్ చేసింది. ఆ నలుగురిలో అన్ స్టాపబుల్ విత్ ఎన్ బీ కే చేసిన బాలయ్య, సామ్ జామ్ హోస్ట్ చేసిన సమంత, సర్కార్ హోస్ట్ చేసిన ప్రదీప్, తమాషా విత్ హర్ష చేసిన వైవా హర్ష ఉన్నారు. అయితే ఈ పోల్ పెట్టిన గంటలోపే కామెంట్ల వర్షం కురిపించారు నెటిజన్స్. అన్ స్టాపబుల్ గా అందరూ బాలయ్యకే ఓటేయడం విశేషం. కాగా Unstoppable with NBK టాక్ షో IMDB ప్రపంచంలోని మోస్ట్ పాపులర్ టాక్ షోస్ లిస్ట్ లో ఒకటిగా నిలిచింది.
Comment below your all time favourite host👇🏻 pic.twitter.com/ppSOmsAvv6
— ahavideoin (@ahavideoIN) May 21, 2022