మెగా ఫ్యామిలీ, అల్లు అర్జున్ మధ్య వివాదం అక్కడ నుంచే మొదలైందంటున్న ఫ్యాన్స్

by Prasanna |
మెగా ఫ్యామిలీ, అల్లు అర్జున్ మధ్య వివాదం అక్కడ నుంచే మొదలైందంటున్న ఫ్యాన్స్
X

దిశ, సినిమా: మెగా ఫ్యామిలీలో వివాదాలు మళ్లీ మొదలయ్యాయి. మెగా ఫ్యామిలీ అంటే.. హీరోలుగా మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, నాగబాబు సపోర్టింగ్ రోల్ చేస్తుంటారు. ఇక మిగతా అందరూ హీరోలే. ఆర్య నుండి పుష్ప వరకు అల్లు అర్జున్ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్‌ని క్రియేట్ చేసుకున్నాడు.

బన్నీ తనకంటూ ఒక ఇమేజ్‌ని ఉండాలని, ఇతరుల నీడల్లో ఎప్పుడు ఉండకూడదని మెగాస్టార్ చిరంజీవి కాంపౌండ్ నుంచి బయటకు వచ్చేశారు. వాస్తవానికి, మెగా ట్యాగ్ ద్వారా అల్లు అర్జున్ హీరో అయ్యాడు. మెగా హీరోలందరిలో స్టైలిష్‌గా ఉండటం వల్లే స్టైల్ స్టార్ అయ్యాడు. తర్వాత ఐకాన్ స్టార్ గా ఎదిగాడు. ఎవరి నీడలోనూ నేను లేనని పరోక్షంగా చెప్పారు. ఐకాన్ స్టార్ గా మారిన తర్వాత నుంచి మెగాభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే అప్పటి నుంచి ఈ మెగా బ్రాండ్‌కు దూరంగా ఉంటున్న బన్నీ .. వారితో ఎక్కువ కలవడంలేదు. తాజాగా, మెగా ఫ్యామిలీలో గొడవలు అక్కడ నుంచే మొదలయ్యాయని ఫ్యాన్స్ ట్రోల్స్ చేస్తున్నారు.

ఒక మనసు సినిమా ఈవెంట్‌లో ఒక అభిమాని “పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్” అని అరిచినప్పుడు, అప్పుడు బన్నీకి బాగా కోపం వచ్చింది. నేను పవన్ కళ్యాణ్ గురించి చెప్పను బ్రదర్.. మీరు పదే పదే పవర్ స్టార్ అంటుంటే అని అరుస్తుంటే ఇబ్బందిగా ఉంది.. ఇతర హీరోల ఈవెంట్లలో కూడా అలా అరవడం కరెక్ట్ కాదని.. తన స్టైల్లో చెప్పాడు. అప్పటి నుంచి అల్లు అర్జున్ మెగా హీరోల గురించి ఏ సినిమా ఈవెంట్‌లోనూ ప్రస్తావించలేదు.

Advertisement

Next Story