అభిమాని ఫోన్ విసిరేసింది అందుకే: రణ్‌బీర్ కొత్త వీడియో వైరల్

by Prasanna |   ( Updated:2023-10-10 06:13:20.0  )
అభిమాని ఫోన్ విసిరేసింది అందుకే: రణ్‌బీర్ కొత్త వీడియో వైరల్
X

దిశ, సినిమా: ఓ అభిమాని సెల్ఫీ కోసం ప్రయత్నించగా.. రణ్‌బీర్ కపూర్ అతని ఫోన్‌ను తీసుకొని విసిరేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టింది. వీడియో చూసిన నెటిజన్లు 'ప్రేమతో అభిమాని సెల్ఫీ కోసం వచ్చిన సమయంలో ఇలా చేయడం కరెక్ట్ కాదని, హీరోకి ఎందుకంత పొగరు' అంటూ తిట్టిపోశారు. ఇక అసలు విషయం ఏమిటంటే.. ఇది ఒక మొబైల్ ప్రకటన అని తెలిసింది. దీనికి సంబంధించిన పూర్తి వీడియో కూడా తాజాగా రిలీజ్ అయింది. ఇందులో రణ్‌బీర్ తన అభిమాని ఫోన్‌ వెనక్కి పడేసి కొత్త ఫోన్ చేతిలో పెట్టి ఫొటోలకు ఫోజులిచ్చాడు.

Advertisement

Next Story