ఇలా అయితే ఎలా అంటూ సమంతపై ఫైర్ అవుతున్న ఫ్యాన్స్..

by Anjali |   ( Updated:2023-06-18 14:43:52.0  )
ఇలా అయితే ఎలా అంటూ సమంతపై ఫైర్ అవుతున్న ఫ్యాన్స్..
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత అనారోగ్య సమస్య నుంచి కోలుకుని ఇప్పుడు వరుస చిత్రాలు చేస్తోంది. కానీ అభిమానులు మాత్రం ఈ విషయంలో అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే సమంతకు ఉన్న క్రేజ్‌‌కు ఏడాదిలో మూడు నాలుగు సినిమాలు చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. హీరోల మాదిరిగా ఏడాదికో సినిమా చేయడం ఎంత వరకు కరెక్ట్‌ అని ప్రశ్నిస్తున్నారు. ఇక ‘ఖుషి’ సినిమా చిత్రీకరణ ముగింపు దశకు వచ్చినా.. తెలుగులో తదుపరి సినిమా మొదలు పెట్టలేదు. కానీ హిందీ వెబ్‌ సిరీస్‌ ‘సిటాడెల్’ షూటింగ్ మాత్రం పూర్తి చేసింది. దీంతో సమంత తెలుగులో కొత్త సినిమాలకు సైన్ చేసేందుకు ఆసక్తి చూపడం లేదని టాక్ వినిపిస్తుండగా.. అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్.

ఇవి కూడా చదవండి:

ప్రియుడితో రొమాన్స్ చేస్తున్న తమన్నా.. బెడ్ రూమ్ ఫొటోలు వైరల్

Advertisement

Next Story