స‌ల్మాన్ సినిమా‌లో స‌మంత వ‌ద్దు.. అనుష్క కావాలంటున్న ఫ్యాన్స్

by Nagaya |   ( Updated:2023-09-16 10:23:19.0  )
స‌ల్మాన్ సినిమా‌లో స‌మంత వ‌ద్దు.. అనుష్క కావాలంటున్న ఫ్యాన్స్
X

దిశ, సినిమా: స‌ల్మాన్‌ఖాన్ హీరోగా విష్ణువ‌ర్ధన్ ద‌ర్శక‌త్వంలో ఓ భారీ యాక్షన్ మూవీని తెర‌కెక్కించేందుకు క‌ర‌ణ్ జోహార్ ఫుల్ ప్రిపేర్‌గా ఉన్నాడు. అదికూడా ‘జ‌వాన్’ త‌ర‌హాలో సౌత్ ఫ్లేవ‌ర్ మాస్ మ‌సాలా హంగుల‌తో రూపొందించనున్నట్లు సమాచారం. అయితే ఈ హై బ‌డ్జెట్ మూవీలో స‌ల్మాన్‌ఖాన్‌కు జోడీగా ద‌క్షిణాది హీరోయిన్‌ను తీసుకోవాల‌నే ఆలోచ‌న‌లో ఉన్నాడట క‌ర‌ణ్. ఇందులో భాగంగా స‌మంత‌, త్రిష‌తో పాటు అనుష్క శెట్టి పేర్లు వినిపిస్తున్నాయి. కాగా ఈ ముగ్గురిలో స‌మంత‌కే ఎక్కువ‌గా ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. కానీ స‌ల్మాన్ ఫ్యాన్స్‌తో పాటు కొంద‌రు నెటిజ‌న్లు మాత్రం స‌మంత కంటే అనుష్క బెట‌ర్.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. స‌ల్మాన్ ఖాన్‌, అనుష్క శెట్టిల జోడీ బాగుంటుంద‌ని, ఆమెను హీరోయిన్‌గా తీసుకోవ‌డం బెస్ట్‌ ఆప్షన్ అని, స‌మంత రాంగ్ ఛాయిస్ అని పేర్కొంటున్నారు. ఎందుకంటే సల్మాన్ పర్సనాలిటీకి సామ్ చాలా చిన్నగా కనిపిస్తుందని, అనుష్క అయితేనే సరిజోడి అని ఫ్యాన్స్ అభిప్రాయం. ఫైనల్‌గా కరణ్ ఎవరిని డిసైడ్ చేస్తాడో వేచి చూడాల్సిందే.

Advertisement

Next Story

Most Viewed