Anjali: కొత్త రికార్డు సాధించిన అంజలి.. బహిష్కరణ వెబ్ సిరీస్ కు మంచి రెస్పాన్స్

by Prasanna |
Anjali: కొత్త రికార్డు సాధించిన అంజలి..  బహిష్కరణ వెబ్ సిరీస్ కు మంచి రెస్పాన్స్
X

దిశ, సినిమా: సీత గా పరిచయమైన హీరోయిన్ అంజలి కొత్త కొత్త పాత్రలతో అందర్ని అలరిస్తుంది. సినిమాల నుంచి వెబ్ సిరీస్ ల వైపు దృష్టి మళ్ళింది. కథను ఎంచుకోవడంలో ఈ ముద్దుగుమ్మ తర్వాతే ఎవరైనా.. ఎందుకంటే తను చేయబోయే పాత్ర అందరికీ మెసేజ్ లా ఉండాలని భావిస్తుంది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో మెరిసిన ఈ బ్యూటీ తాజాగా, బహిష్కరణ వెబ్ సిరీస్ లో వేశ్వ పాత్రలో నటించింది. ఈమెను ఇలా చూసి ఒక్కసారిగా ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు కూడా షాక్ అయ్యారు.

ఈ సిరీస్ లో అంజలి ఫస్ట్ లుక్ విడుదల చేసినప్పటి నుంచి మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత వచ్చిన టీజర్, ట్రైలర్ భారీ హైప్ ను క్రియోట్ చేసాయి. ముకేష్ ప్రజాపతి డైరెక్షన్ లో వచ్చిన ఈ సిరీస్ జూలై 19 న ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5లో స్ట్రీమ్ అయింది. ఫస్ట్ డే నుంచే భారీ స్థాయిలో వ్యూస్ వస్తున్నాయి.

కేవలం మూడు రోజుల్లోనే 3.5 కోట్ల వ్యూయింగ్ నిమిషాలు దాటేసింది. అంజలి కెరియర్లోనే ఇలా రావడం మొదటిసారి. రిలీజ్ నుంచి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా, ఈ సిరీస్ లో అంజలి మరోసారి తన నట విశ్వరూపం చూపించిందనే చెప్పుకోవాలి. ఇది చూసిన నెటిజెన్స్ కథ చాలా బాగుందంటూ కామెంట్స్ చేస్తున్నారు.



Next Story

Most Viewed