పవన్ సినిమా కోసం ఇంటిని తాకట్టు పెట్టిన అభిమాని!?

by Prasanna |   ( Updated:2023-09-20 06:34:22.0  )
పవన్ సినిమా కోసం ఇంటిని తాకట్టు పెట్టిన అభిమాని!?
X

దిశ, సినిమా: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానుల గురించి చెప్పాల్సిన పనిలేదు. వారు ఎల్లప్పుడూ ఉత్సాహంగా ఉంటారు. ఇక పవన్‌ను ఎవరైనా ఏమైనా అంటే రచ్చ రచ్చే. మరీ ముఖ్యంగా ఆయన వ్యక్తిగత విషయాల గురించి ఏదైనా తప్పుగా మాట్లాడితే పట్టుకుని కొడతారు. ఇలాంటి సంఘటనలు ఇప్పటికి చాలా చూశాం. ఇకపోతే పవన్ నటించిన ‘అజ్ఞాతవాసి’ సినిమా అందరూ చూసే ఉంటారు. అట్టర్‌ప్లాప్ అయినా ఆ మూవీ ఆయన అభిమానుల్ని చాలా నిరాశపరిచింది.

అయితే పవన్, త్రివిక్రమ్ కాంబో అంటే ఏ రేంజ్‌లో అంచనాలుంటాయో తెలిసిందే. కాగా ‘అజ్ఞాతవాసి’ సినిమా టికెట్ల కోసం గొడవలు పెట్టుకున్నారట ఫ్యాన్స్. మరికొన్ని చోట్ల అయితే టికెట్‌ను వేలం పాట పాడి మరీ లక్షలు పెట్టి కొనుగోలు చేశారట. ఇందులో భాగంగా మొదటి రోజు ‘అజ్ఞాతవాసి’ బెనిఫిట్ షో చూడడం కోసం ఓ అభిమాని ఏకంగా తన ఇంటిని తాకట్టు పెట్టి రూ.20 లక్షలు అప్పు చేసి మరీ టికెట్ కొనుగోలు చేశాడట. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. ఇక ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో ‘అభిమానం ఉండొచ్చు కానీ పిచ్చి ఉండకూడదు’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Next Story