పబ్లిక్‌గా ఆ హీరోకు చెప్పుదెబ్బలు.. వీడియో వైరల్..

by Hajipasha |   ( Updated:2022-12-20 14:18:41.0  )
పబ్లిక్‌గా ఆ హీరోకు చెప్పుదెబ్బలు.. వీడియో వైరల్..
X

దిశ, సినిమా: కన్నడ హీరో దర్శన్‌కు ఊహించని చేదు అనుభవం ఎదురైంది. ఆయన నటించిన తాజా చిత్రం 'క్రాంతి' జనవరి 26న విడుదల కానుండగా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలోనే హోస్పేట్‌లో ఏర్పాటు చేసిన సెకండ్ సాంగ్ రిలీజ్ వేడుకలో వేదికమీదున్న దర్శన్‌ మీదకు ఓ వ్యక్తి చెప్పు విసిరాడు. అది కాస్తా దర్శన్ ముఖంపై తగలడంతో ఒక్కసారిగా మూవీయూనిట్ ఖంగుతిన్నారు. అయితే సదరు వ్యక్తిని ఏమీ చేయొద్దని సూచించిన దర్శన్.. వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కాగా ఇందుకు సంబంధించిన ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ఇక ఈ దాడికి కారణం.. పునీత్ రాజ్‌కుమార్‌పై ఓ ఇంటర్వ్యూలో దర్శన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలేనని తెలుస్తోంది. 'నా అభిమానులు నన్ను ఎంతో ప్రేమిస్తారు. అదే పునీత్‌ను తీసుకుంటే.. ఆయన చనిపోయిన తర్వాత విశేష ఆదరణ పొందుతున్నారు. కానీ, నేను బతికి ఉండగానే ఫ్యాన్స్ ప్రేమను పొందుతున్నా' అంటూ ఆయన చేసిన కామెంట్స్ దుమారాన్ని రేపాయి. దీంతో పునీత్ అభిమానే ఈ ఎటాక్ చేసి ఉంటాడని టాక్. ఇదిలావుంటే.. 'అదృష్ట దేవత స్వయంగా ఇంటికి వస్తే వెంటనే ఆమెను దుస్తులు విప్పి ఇంట్లో బందీ చేయాలి. అలా కాకుండా ఒకవేళ మీరు ఆమెకు బట్టలు ఇచ్చేస్తే.. ఆమె వేరే చోటుకు వెళ్లిపోతుంది' అని చేసిన కామెంట్స్‌పై మహిళలు భగ్గుమన్నారు. కాగా స్త్రీలను కించపర్చినందుకే దర్శన్‌పై చెప్పుదాడి జరిగినట్లుగా కూడా అనుమానిస్తున్నారు. ఏదేమైనా దీనిపై త్వరలో నిజా నిజాలు తెలియాల్సివుండగా దర్శన్ ఫ్యాన్స్ తమ హీరోకు మద్దతు తెలుపుతూ.. 'ఎంత కోపం ఉంటే మాత్రం ఇలా చేయడం సరికాదు. కాస్త మనుషుల్లా ప్రవర్తిద్దాం' అంటూ #WeStandWithDBoss అనే హ్యాష్‌ ట్యాగ్‌ను ట్విట్టర్‌లో వైరల్ చేస్తున్నారు.

అలాగే ఈ విషయం మీద స్పందించిన కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్.. సుదీర్ఘ లేఖ విడుదల చేశాడు. 'ఇలా దాడులు చేయడం సరైన సమాధానం కాదు. మనం నివసించే భూమి, భాష, కల్చర్ మనకి అన్ని విషయాల్లోనూ ప్రేమగా ఉంటూ ఇతరులకు గౌరవం ఇవ్వాలని నేర్పించాయి. ప్రతి సమస్యకు ఒక సొల్యూషన్ ఉంటుంది. అనేక దారుల్లో సమస్యను సాల్వ్ చేయొచ్చు. ప్రతి మనిషికి గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎలాంటి సమస్య ఉన్నా మాట్లాడి పరిష్కరించుకోవాలి. వీడియో చూసి చాలా డిస్టర్బ్ అయ్యాను. పబ్లిక్ ఈవెంట్‌లో దాడి చేయడం కరెక్ట్‌గా అనిపించలేదు. ఇతర రాష్ట్రాల వారు చూస్తే కన్నడ అభిమానులు ఇలా ప్రవర్తిస్తారా? అని అనుకునే ప్రమాదం ఉంది' అంటూ బాధపడిపోయాడు.

Advertisement

Next Story

Most Viewed