బిగ్‌బాస్ వల్ల నేను రోడ్డున పడ్డా.. టీఆర్పీ కోసం నన్ను దారుణంగా దిగజార్చారు.. సోనియా సంచలన కామెంట్స్

by Kavitha |   ( Updated:2024-10-06 12:42:16.0  )
బిగ్‌బాస్ వల్ల నేను రోడ్డున పడ్డా.. టీఆర్పీ కోసం నన్ను దారుణంగా దిగజార్చారు.. సోనియా సంచలన కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు బిగ్‌బాస్ సీజన్ 8 సెప్టెంబర్ 1న మొదలై ఇప్పటికే ఐదు వారాలు పూర్తి చేసుకుంది. ఇందులో 14 మంది కంటెస్టెంట్స్ పాల్గొనగా.. ఐదు వారాలకు 6 మెంబెర్స్ హౌస్ నుంచి బయటకు వచ్చేశారు. ఇక నాలుగో వారంలో బయటకు వచ్చిన సోనియా.. హౌస్‌లో జరిగిన వాటిని బయట పెడుతూ వస్తుంది. హౌస్‌లో ఉన్నప్పుడు ఆమె బాగోతాలంటూ చిత్రీకరించారు. కానీ.. బయటకు వచ్చిన తర్వాత అసలు బాగోతం ఏంటో తనని ఏ విధంగా బ్యాడ్ చేశారో చెప్పుకొచ్చింది. ఈ క్రమంలో హౌస్ ఎఫైర్స్ ఇవే అంటూ చెప్పి అందరికీ షాక్ ఇచ్చిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే..

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సోనియా బిగ్‌బాస్ గుట్టు మొత్తం రట్టు చేసింది. ఆమె మాట్లాడుతూ.. “హౌస్‌లో కిచెన్ వర్క్ అంతా నేనే చూసుకున్నా. రేషన్ కంట్రోల్ చేశా. అలాగే హౌస్ మొత్తం బాధ్యత తీసుకుని.. టాస్క్‌లలో కూడా ఇరగదీశా. కానీ మీకు చూపించింది మాత్రం అంతా తప్పుగా నిఖిల్, పృథ్వీలతో ఉన్నదే. పోనీ చూపించింది కూడా పూర్తిగా చూపించకుండా అంతా కట్ చేసి ప్రేక్షకులకు నన్ను బరితెగించిన అమ్మాయిల చూపించారు. అక్కడ జరిగింది వేరు, చూపించింది వేరు. నేను పృథ్వీ, నిఖిల్‌లను వాడుకున్న అని అంటున్నారు. నేనెప్పుడు ఆ స్థాయికి దిగజారలేదు.

అయినా హౌస్‌లో ఉన్నంత సేపు నన్ను ఫోకస్ చెయ్యడం ఎందుకు..? కేవలం చేతులు వేయడం హగ్, చేసుకోవడం వంటి వాటినే హైలెట్ చేశారు. అలా కాకుండా పూర్తిగా చూపించి ఉంటే ఆడియన్స్‌కు నిజం తెలిసేది. షోను ముందుకు తీసుకెళ్లడం కోసం నన్ను ఇంత దారుణంగా దిగజార్చారు. ఒక్క మాటలో చెప్పాలంటే బిగ్ బాస్‌కు బుద్ది లేని పనులు చేసి చూపించారు. అందరికీ ఎఫైర్స్ ఉన్నాయి ఇప్పుడు అవన్నీ బయటకు వస్తాయి” అంటూ సోనియా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ అమ్మడు చేసిన కామెంట్స్ నెట్టింట దుమారం రేపుతున్నాయి.

Read More..

అర్ధరాత్రి ఆ స్టార్ హీరో నా గది తలుపులు తట్టాడు.. హీరోయిన్ సంచలన కామెంట్స్

Advertisement

Next Story