- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కష్టమైనా సరే మహిళా ప్రాధాన్య చిత్రాలే తెరకెక్కించాలి: కృతి సనన్
దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ హిందీలో పలు చిత్రాల్లో నటించి తన అందం, అభినయంతో ప్రేక్షకులను మంత్ర ముగ్దులను చేసింది. అలాగే తెలుగులో ఆ అమ్మడు నేనొక్కడినే, ఆదిపురుష్ వంటి సినిమాల్లో నటించి మెప్పించిన ఈ అమ్మడు ఇటీవల ‘క్రూ’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రజెంట్ కృతి ‘దో పత్తీ’ మూవీలో నటిస్తోంది. ఈ క్రమంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ యంగ్ బ్యూటీ ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘‘భిన్నమైన కథలతో, భారీ బడ్జెట్‌తో కష్టమైనా సరే మహిళా ప్రాధాన్య చిత్రాలు తెరకెక్కిస్తారని ఆశిస్తున్నాను.
దర్శకనిర్మాతలు సైతం ఆ దిశగానే అడుగులు వేస్తున్నారు. నేను నటించిన మిమీ, బరేలీ కీ బర్ఫీ ఈ కోవకు చెందినవే. మహిళలు ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోగలరని నిరూపించిన చిత్రాలు. ఈ మధ్య కాలంలో నేను విభిన్న కథల్లో నటించడానికి ప్రయత్నిస్తున్నాను. మరికొద్ది రోజుల్లో ‘దో పత్తీ’ మూవీతో మీ ముందుకు వస్తున్నాను. ఉహించని విధంగా సినిమా ఉండబోతుంది రెడీగా ఉండండి’’ అని చెప్పుకొచ్చింది.