మన నాయకులకు ప్రజల బాధలు పట్టవు: Esha Gupta

by Harish |   ( Updated:2022-11-12 04:24:26.0  )
మన నాయకులకు ప్రజల బాధలు పట్టవు: Esha Gupta
X

దిశ, సినిమా: ఢిల్లీ-ఎన్‌సి‌ఆర్ వాయు కాలుష్యంపై ఎవరూ సరైన చర్యలు తీసుకోవట్లేదంటూ నటి ఈషా గుప్తా ఆందోళన వ్యక్తం చేసింది. ఢిల్లీకి చెందిన ఆమె ఓ కార్యక్రమానికి హాజరై పలు విషయాలపై ప్రశ్నలు లేవనెత్తింది.

ఈ వాయు కాలుష్యం, పొగమంచు సమస్య కేవలం ఢిల్లీకి మాత్రమే పరిమితం కాలేదన్న నటి.. ఉత్తర భారతదేశం మొత్తం ఈ సమస్యతో బాధపడుతుందని, గాలిలో నాణ్యత లేక ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని వాపోయింది.

'ఏడాది పొడవునా నివారణ చర్యలు తీసుకోకుండా గాలి పీల్చుకోలేనప్పుడు మాత్రమే మన దేశ నాయకులు ప్రతిస్పందించడం విచారకరం. పంట గడ్డి దహనం, వ్యర్థాలను కాల్చివేయడం దీనికి ప్రధాన కారణం. 'బయో ఎంజైమ్-పూసా'తో గడ్డి కుళ్ళిపోతుంది. దీన్ని ప్రతి రైతుకు ప్రభుత్వం ఉచితంగా అందజేస్తుంది' అంటూ అవగాహన కల్పించే ప్రయత్నం చేసింది.

ఇక ప్లాస్టిక్ కవర్లు, బాటిళ్లను రీసైక్లింగ్ చేయడం ఉత్తమ మార్గంగా పేర్కొన్న ఆమె.. రోజువారీ జీవితంలో ఇలాంటి పనులు అమలు చేస్తూ మార్పులు తీసుకురావాలని కోరింది.

Advertisement

Next Story

Most Viewed