‘వయసు ఏదైనా సరే ప్రతి దశను ఆస్వాదించండి’: కంగన రనౌత్

by Anjali |   ( Updated:2024-09-15 14:39:57.0  )
‘వయసు ఏదైనా సరే ప్రతి దశను ఆస్వాదించండి’: కంగన రనౌత్
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగన రనౌత్ తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా ఈ హీరోయిన్ కెరీర్ తొలినాళ్లను గుర్తు చేసుకుంది. ‘వో లమ్హే’ సినిమా నా రెండో సినిమా.. ఈ మూవీ మ్యూజిక్ రిలీజ్ ఈవెంట్‌కు సంబంధించిన వీడియోలో నేను చాలా చిన్న ఏజ్‌లా కనిపిస్తాను. అప్పుడు నేను టీనేజ్‌లో ఉన్నాను. నా లుక్స్ నాకు నచ్చేవి కావు. నేను బ్యూటిఫుల్‌గా ఉన్నానని ఎప్పుడూ కూడా అనుకోలేదు. నన్ను నేను అసహ్యించుకునేదాన్ని కనుకే స్టేజ్‌పై ధైర్యంగా నిలబడలేకపోయేదాన్ని.

కానీ ఇవాళ వెనక్కి తిరిగి చూసుకుంటే మళ్లీ ఆ అందాన్ని ఎలా పొందగలనని అనిపిస్తుంది’ అంటూ పేర్కొంది. ఈ బ్యూటీ మహిళలకు ఓ సజెషన్ కూడా ఇచ్చింది. ‘ఏ ఏజ్‌లో ఉన్న సరే ప్రతి దశను కూడా ఎంజాయ్ చేయాలి. మీకు మీరే బ్యూటిఫుల్‌గా ఉన్నానని భావించండి’ అంటూ కంగనా రనౌత్ తెలిపింది. ఇకపోతే ఈ హీరోయిన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఎమర్జెన్సీ చిత్రం వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఇందిరా గాంధీ జీవితాన్ని ఆధారంగా చేసుకుని తీసిన ఈ మూవీ సెప్టెంబరు 6 వ తేదీన థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కానుంది. కానీ సెన్సార్ సర్టిఫికేట్ రాకపోవడంతో పోస్ట్ పోన్ అయ్యింది.

Advertisement

Next Story

Most Viewed