- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏక్తా కపూర్‌కు అరుదైన గుర్తింపు.. దేశానికి ప్రాతినిధ్యం వహించడం గర్వంగా ఉందన్న నిర్మాత
దిశ, సినిమా: ప్రముఖ బాలీవుడ్ నిర్మాత ఏక్తా కపూర్‌కు అరుదైన గౌరవం లభించింది. న్యూయార్క్‌లో నవంబర్ 20న 51వ ‘అంతర్జాతీయ ఎమ్మీ అవార్డ్స్’ ప్రదానోత్సవం వేడుకలు జరగనుండగా.. టెలివిజన్ పరిశ్రమలో చేసిన కృషికి గుర్తింపుగా ఏక్తాను ప్రతిష్టాత్మకమైన ‘ఇంటర్నేషనల్ ఎమ్మీ డైరెక్టరేట్ అవార్డు’తో గౌరవించనున్నట్లు అకాడమీ ఆఫ్ టెలివిజన్ ఆర్ట్స్ అండ్ సైన్స్ అధ్యక్షుడు, సిఈవో బ్రూస్ ఎల్. పేయిస్ నర్ వెల్లడించారు. అయితే తనకు ఈ గుర్తింపు దక్కడంపై ఆనందం వ్యక్తం చేసిన ఏక్తా కపూర్.. ‘నా హృదయంలో ఈ అవార్డుకు ప్రత్యేక స్థానముంది.
ఈ గుర్తింపు నాకు మరింత ఉత్సాహన్నిస్తుంది. పర్సనల్ అండ్ వర్క్ లైఫ్‌లో ఇదెంతో కీలకమైన అంశం. ఈ వేదికపై నా దేశానికి ప్రాతినిధ్యం వహించడం గర్వంతోపాటు గౌరవంగా ఉంది. మహిళల కోసం భిన్ననమైన కథలు క్రియేట్ చేయడం కోసం టెలివిజన్ నాకొక సాధనం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్త్రీలు, నా మిత్రులు, సహచరులకు ప్రాతినిధ్యం వహించేలా ఈ అవార్డు నాకు గుర్తింపు ఇవ్వనుంది. థాంక్స్ ఎమ్మీ’ అంటూ నెట్టింట పోస్ట్ షేర్ చేసింది.