దసరా ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. నాని ఫ్యాన్స్‌లో పూనకలే..

by samatah |   ( Updated:2023-03-28 09:52:48.0  )
దసరా ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. నాని ఫ్యాన్స్‌లో పూనకలే..
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న మూవీ దసరా, ఈనెల 30 న ప్రేక్షకుల ముందుకు రానుంది. నాని తొలి పాన్ ఇండియా చిత్రం ఇది. ఇక ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. ఇందులో కీర్తీ సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది.

తెలంగాణ నేపథ్య కథాంశంతో వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు భారీ ఎత్తున పెరిగిపోయి. కళ్లకు ఐనా పెట్టి ఓ వదినా అనే సాంగ్‌తో సినిమాపై మరింత ఎక్సెపెక్టేషన్స్ పెరిగిపోయాయి.

కాగా, ఈ మూవీ విడుదలకు ముందే ద‌స‌రా` ఫ‌స్ట్ రివ్యూ బ‌య‌ట‌కు వ‌చ్చింది. విడుదలకు రెండు రోజుల ముందే ఓవర్సీస్ సెన్సార్ సభ్యుడు ఉమర్ సంధు దసరా చిత్రంపై త‌నదైన శైలిలో రివ్యూ అండ్ రేటింగ్ ఇచ్చారు.

దసరా మూవీ బాగుందని, ఈ మూవీతో నాని పాన్ ఇండియా స్టార్‌గా మారడం పక్కా అంటూ అతను తెలిపాడు. దసరా లో నాని వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు. తన నటనతో అందరినీ ఆకట్టుకుంటాడు. నాని పాత్ర చూసిన తమ ఫ్యాన్స్‌కు పూనకాలు పక్కా.. ఇక కీర్తి సురేష్ ఆటం బాంబులా పేలింది. యాక్షన్ సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఒక్క ముక్క‌లో చెప్పాలంటే పుష్ప 2.0` అని పేర్కొంటూ ఏకంగా 3.5/5 రేటింగ్ ఇచ్చారు. ఉమర్ సంధు రివ్యూతో నాని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోతున్నారు. ఇక మార్చి 30న ఈ చిత్రం తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ, హిందీ భాష‌ల్లో భారీ ఎత్తున విడుద‌ల కాబోతోంది.

ఇవి కూడా చదవండి: Dasara Movie: యూఎస్‌లో ప్రీ సేల్స్.. 200K డాలర్ల మార్క్‌ దాటిన ‘దసరా’

Advertisement

Next Story