Double Ismart: రామ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ డీల్.. ‘డబుల్ ఇస్మార్ట్’ క్రేజ్ మామూలుగా లేదుగా!

by sudharani |
Double Ismart: రామ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ డీల్.. ‘డబుల్ ఇస్మార్ట్’ క్రేజ్ మామూలుగా లేదుగా!
X

దిశ, సినిమా: ఉస్తాద్ రామ్ పోతినేని, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌ల రెడ్లీ కాంబినేషన్‌లో రాబోతున్న మోస్ట్- వెయిటెడ్ పాన్ ఇండియా మూవీ ‘డబుల్ ఇస్మార్ట్’. 2019లో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’కు సీక్వెల్‌గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ప్రజెంట్ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 15న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఇక రిలీజ్ సమయం దగ్గరపడటంతో ప్రమోషన్స్‌లో జోరు పెంచింది చిత్ర బృందం. ఈ క్రమంలోనే వరుస అప్‌డేట్స్ ఇస్తూ సందడి చేస్తున్నారు.

ఇప్పటికే రిలీజైన పోస్టర్స్, గ్లింప్స్ విశేషంగా ఆకట్టుకోగా.. ఫస్ట్ సింగిల్, సెకండ్ సింగిల్ సోషల్ మీడియాలో అత్యధిక వ్యూస్‌తో దూసుకుపోతున్నాయి. దీంతో మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదిలా ఉంటే.. ఈ సిసినిమాకు సంబంధించిన సాలిడ్ న్యూస్ ఒకటి ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందుతున్న సమాచారం మేరకు.. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల వరల్డ్ డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ షో రూ. 33 కోట్లకు సొంతం చేసుకుంది. కాగా.. రామ్ కెరీర్‌లోనే ఇప్పటి వరకు ఏ సినిమాకు జరగని బిగ్గెస్ట్ డీల్ ఈ మూవీకి జరిగినట్లు సమాచారం.



Next Story